
Umair Sandhu: బాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా.. ఇండియన్ సినిమా అంటేనే బాలీవుడ్.. బాహుబలి విడుదల అయ్యేంతవరకు ఇలానే ఉండేది. ఆ తర్వాత లెక్కలు మారాయి. ఉత్తరాదిలోనూ దక్షిణాది పాగా వేయడం ప్రారంభమైంది. కోట్లకు కోట్లు వసూలు సాధించడం కూడా మొదలైంది.. బాహుబలి, బాహుబలి_2 కేజీఎఫ్, కేజీఎఫ్_2, పుష్ప, కార్తీకేయ_2, ఆర్ఆర్ఆర్, కాంతార, విక్రమ్.. ఇలా ఒక్కో సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాయి. అంతటి చరిత్ర ఉన్న అమీర్ ఖాన్ ను నిఖిల్ అనే యువ హీరో నిలువరించాడు..లాల్ సింగ్ చద్దా సినిమాను తన కార్తికేయతో సోయిలో లేకుండా చేశాడు.. ఇక వీటన్నింటికీ మించి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టింది. ఉత్తమ పాటగా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దక్షిణాది ఇంతగా ఎదుగుతోంది.. దీంతో సహజంగానే ఉత్తరాది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. దీంట్లో అన్నిటికంటే దరిద్రం ఏంటంటే వాడెవడో ఉమైర్ సింధూ అంట. ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకుంటాడు. ఈ నెత్తి మాసినోడు దక్షిణాది నటులపై విష ప్రచారం చేస్తున్నాడు.
మొన్న ఒక ట్వీట్ చేశాడు.. ఏంటయ్యా అంటే…కేజీఎఫ్_2 చిత్రీకరణ సమయంలో తన సహనటి శ్రీనిధి శెట్టితో హీరో యశ్ అనుచితంగా ప్రవర్తించాడని.. ఆమెను పడక గదిలోకి రావాలని ఫోర్స్ చేశాడని..ట్విట్టర్ లో వదిలాడు. అంతే కాదు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి అండ్ టీం లాబీయింగ్ చేసిందని.. అంతే కాదు దక్షిణాది దర్శకులకు సృజన లేదని, అందుకే వాటిని బాలీవుడ్లో రీమేక్ చేస్తే ఫ్లాఫ్… ఇలా ఏవేవో ట్వీటుతున్నాడు.

ఉమైర్ సింధూ..కు తెలియనిది ఏంటంటే.. ఉత్తరాదిలో ఆల్రెడీ దక్షిణాది జెండా పాతింది.. దానిని మరింత స్ట్రాంగ్ చేసుకుంటోంది.. ఓ అక్షయ్ కుమార్ సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్న వేళ, షారుక్ ఖాన్ సినిమాకు దొంగ కలెక్షన్ల లెక్కలు అంటగడుతున్న వేళ, ఓ అమీర్ ఖాన్ సినిమాకు థియేటర్లు ఎత్తేస్తున్న వేళ .. ఉత్తరాది సినిమాకు దక్షిణాది ఆయువుపట్టుగా నిలుస్తోంది.. ఒకవేళ దక్షిణాది సినిమాలే గనుక లేకుంటే ఉత్తరాదిలో చాలా థియేటర్లు ఖాళీగా ఉండేవి.. అక్కడిదాకా ఎందుకు మొన్నటికి మొన్న తెలుగు బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురం రీమేక్ లో షేహజాద ను ఇష్టం వచ్చినట్టు తీస్తే జనం చూడం పో అనేశారు.. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ ను సెల్ఫీ అని అక్షయ్ కుమార్ తీస్తే ఏ హే పో అని జనం లైట్ తీసుకున్నారు.. ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే బాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా కాదు..అని ఉడ్ లు కలిస్తేనే భారతీయ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్ కు ఇది బోధపడింది.. ఉమైర్ సింధూ కు బోధపడాలి!