
Chetan Sharma: చేతన్ శర్మ… నిన్నటి నుంచి మీడియాలో , సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు.. ట్విట్టర్లో ట్రెండింగ్ గా నిలిచిన పేరు. గూగుల్ సెర్చింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిన పేరు. క్రికెట్ చూసేవారికి తప్ప పెద్దగా పరిచయం లేని పేరు.. ఇప్పుడు ఎందుకు అందరి నోట్లో నానుతోంది? ఈయన అంటే ఎందుకు క్రికెటర్ల లో మంట మండుతోంది?
Also Read: Rayalaseema- CM Jagan: జగన్.. మరోసారి రాయలసీమకు అన్యాయం తప్పదా ?
చేతన్ శర్మ 1966 జనవరి 3న జన్మించాడు. 1983లో తన 17వ ఏట పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కాలు పెట్టాడు. ఆ తర్వాత ఏడాది వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇండియా తరఫున వన్డే, టెస్ట్ మ్యాచులు ఆడాడు. ఫస్ట్ బౌలర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.. 1984 లో పాకిస్తాన్లోని లాహోర్లో ఆ దేశం పైన జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా చేతన్ శర్మ ఇంటర్నేషనల్ కెరియర్ ప్రారంభించాడు. తొలి ఓవర్ లో ఐదో బంతికే మోహిసిన్ ఖాన్ ను ఔట్ చేసి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసిన మూడో ఇండియన్ క్రికెటర్ గానూ చేతన్ శర్మ రికార్డు సాధించాడు.
వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో తొలిసారిగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఆటగాడిగా చేతన్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. 1987 లో జరిగిన రిలయన్స్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో చేతన్ శర్మ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. శర్మకు స్వయంగా కపిల్ దేవ్ కి కూడా క్రికెట్లో శిక్షణ ఇచ్చిన ద్రోణాచార్య అవార్డు విన్నర్ దేష్ ప్రేమ్ ఆజాద్ శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆజాద్ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, ఠాకూర్ కు కోచింగ్ ఇస్తుండడం విశేషం.. 1985లో శ్రీలంక టూర్ లో మూడు టెస్ట్ మ్యాచ్లో 14 వికెట్లు తీసిన చేతన్ శర్మ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డ పైనా తిరుగులేని రికార్డు చేతన్ శర్మ సాధించాడు. 1986లో ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా ఆ జట్టును 2_0 తేడాతో భారత్ మట్టికరిపించింది. ఆ రెండు మ్యాచ్ ల్లో చేతన్ శర్మ మొత్తం 16 వికెట్లు తీయడం గమనార్హం. అందులో ఒక మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు.. ఇప్పటివరకు ఆ రికార్డు ఎవరూ బీట్ చేయలేదు.

1996లో చేతన్ శర్మ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2004 హర్యానాలోని పంచకులలో ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ అకాడమీ స్థాపించినప్పటికీ… 2009లో దాన్ని కూడా మూసేసి ఎక్కువ కాలం పాటు క్రికెట్ కామెంట్రేటర్ గానే కొనసాగాడు.. యశ్ పాల్ శర్మ అనే మరో సీనియర్ క్రికెటర్ కి చేతన్ శర్మ సమీప బంధువు అవుతాడు. చేతన్ శర్మ క్రికెట్ లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సమాజ్వాది పార్టీలో చేరి 2009లో ఫరీదాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ అయ్యాడు.. 2007 డిసెంబర్లో చేతన్ శర్మ పిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమితుడయ్యాడు.. అయితే 2022 నవంబర్లో జరిగిన వరల్డ్ కప్ నుంచి టీం ఇండియా నిష్క్రమణ తర్వాత అతడిని ఆ స్థానం నుంచి తప్పించారు. ఆ తర్వాత బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ చేతన్ శర్మనే తిరిగి బీసీసీఐ సెలెక్టర్స్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ గత నెల అంటే 2023 జనవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేతన్ శర్మ మరొకసారి ఆ పదవి చేపట్టాడు.. ఇప్పుడు ఓ మీడియా ఛానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో భారత క్రికెట్ సమాఖ్యలో బాగోతాన్ని బయటపెట్టాడు.
Also Read: Maoist Letter: శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం.. ఆ మంత్రికి రెండోసారి హెచ్చరికలు