
Smith Duck Out: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతున్నది. బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా అశ్విన్ ధాటికి ముప్పు తిప్పలు పడుతోంది. ఈ కథనం రాసే సమయానికి అతడు 3 వికెట్లు తీశాడు. మొదటి టెస్ట్ లో లాగానే అశ్విన్ ఈ మ్యాచ్ లోనూ బంతిని తనకు నచ్చినట్టు తిప్పుతూ ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే అతడికి వికెట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా షమీ బౌలింగ్ లో వార్నర్ అవుట్ అయిన తర్వాత లబు షేన్, ఖవాజా ఇద్దరు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఖవాజా అయితే భారత బౌలర్ల పై ఎదురు దాడికి దిగాడు. భారీ షాట్లు ఆడి ఆకట్టుకున్నాడు.
అయితే లబు షేన్ కూడా ఆశ్విన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ధీటుగా బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ లో బౌండరీలు సాధించాడు.అతను తన వ్యక్తిగత స్కోర్ 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆశ్విన్ వేసిన బంతిని డిపెండ్ చేసుకోబోయాడు. క్రమంలో బంతి అతని బ్యాట్ పక్క నుంచి వెళ్ళి ప్యాడ్లను తాకింది. భారత జట్టు అప్పీల్ చేయగా ఎంపైర్ ఔట్ ఇవ్వలేదు. అశ్విన్ చాలా నమ్మకంతో చెప్పగా రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే లో బంతి బ్యాట్ ను తాకలేదు అని తేలడంతో లబు షేన్ పెవిలియన్ చేరాడు.
లబు షేన్ పెవిలియన్ బాట పట్టడంతో స్టీవ్ స్మిత్ క్రీజులో కి వచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పరుగులు ఏవీ చేయలేదు. రెండో బంతికి మాత్రం పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన బంతి స్పిన్ అయి తన వైపు వస్తుందని స్మిత్ భావించాడు.కానీ అది స్పిన్ అవకుండా బ్యాట్ కు దూరంగానే కీపర్ వైపు వెళ్ళింది. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ భరత్ చక్కగా క్యాచ్ పట్టాడు. బ్యాట్ కు బంతి తగిలినట్టు తెలిసిన స్మిత్.. అంపైర్ చివరి నిర్ణయం వరకు కూడా ఆగలేదు. చాలా అసహనంతో చిరాకుగా మైదానం విడాడు.. భారత గడ్డపై అతను ఇలా డకౌట్ అవడం ఇదే తొలిసారి.

స్మిత్ దకౌట్ అవడంతో క్రీడాభిమానులు మీమ్స్ పేలుస్తున్నారు. ఆటకు ముందు పిచ్ ను పరిశీలిస్తున్న స్మిత్ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్ ను పరిశీలించినంత సేపు కూడా బ్యాటింగ్ చేయలేదు కదా అంటూ జోకులు పేలుస్తున్నారు. పిచ్ ను బ్యాట్ తో చిల్లులు పడేలా చేయాలని చూస్తే ప్రయోజనం లేదు. ప్రాక్టీస్ చేసి, స్పిన్ ను ఎదుర్కోవాలి అని వాడికి చెప్పండి రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు మొదటి టెస్ట్ లో కొద్దో గొప్పో ప్రభావం చూపిన స్మిత్… రెండో టెస్ట్ లో డక్ ఔట్ అవడాన్ని ఆస్ట్రేలియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Marnus Labuschagne ✅
Steve Smith ✅@ashwinravi99 gets 2⃣ big wickets in one over 💪💥#TeamIndia #INDvAUS pic.twitter.com/UwSIxep8q2— BCCI (@BCCI) February 17, 2023