
Waltair Veerayya Records: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరం చూసాము.మెగాస్టార్ కి గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు అవసరం లేదు, ఒక మామూలు కమర్షియల్ సినిమా ఇచ్చినా చాలు,బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయని మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసిన చిత్రమిది.
రెండు డిజాస్టర్స్ పడగానే తన పని అయిపోలేదు, ఇప్పటికీ తనని రీచ్ అయ్యే స్టార్ హీరో నేటి తరం లో కూడా లేదు అనే రేంజ్ లో ఈ సినిమా రికార్డ్స్ ని నెలకొల్పింది.సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది అంటే మెగాస్టార్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో క్రియేట్ చేసిన రికార్డ్స్ రాజమౌళి సినిమాలు కూడా చెయ్యలేకపోయాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంద్ర వంటి ప్రాంతాలలో ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో #RRR క్లోసింగ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది.ముఖ్యంగా వైజాగ్ లోని ‘జగదాంబ’ లాంటి పాపులర్ థియేటర్ లో కోటి 16 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం థియేటర్ రికార్డుని నెలకొల్పింది.అలా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం లో మాత్రమే కాదు, సీడెడ్ మరియు నెల్లూరు జిల్లాలలో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి బాహుబలి పార్ట్ 1 కలెక్షన్స్ ని ఎప్పుడో దాటేసింది.ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళి సినిమాల రికార్డ్స్ కూడా బ్రేక్ అయినా సెంటర్స్ కనిపిస్తూనే ఉంటాయి.కొన్ని సెంటర్స్ లో అయితే ‘నాన్ రాజమౌళి’ రికార్డు క్యాటగిరి మాదిరిగానే ‘నాన్ చిరంజీవి’ రికార్డ్స్ అని ఇకపై చెప్పుకుంటారంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.