India and Pakistan war : భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది దుర్మార్గపు దాయాది దేశం. కాకపోతే పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది.. కాకపోతే దాయాది దేశానికి బయటినుంచి ఇతర దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులపాటు యుద్ధం చేయగలుగుతోంది. డ్రాగన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలు సరిగా పనిచేయకపోయినప్పటికీ.. దాయాది దేశం దాడులకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. పైగా బార్డర్లో దారుణమైన కాల్పులకు తెగబడుతోంది. అమాయకులైన భారతీయ పౌరులను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిర్మలత్వానికి, స్వచ్ఛతకు మారుపేరైన కాశ్మీర్ రాష్ట్రంలో కల్లోలం రగిలించే ప్రయత్నం చేస్తోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో ఒక వీడియో మాత్రం జేమ్స్ బాండ్ సినిమాను మించి తలపిస్తోంది.
Also Read : పాక్ తో ఉద్రిక్తతలు.. ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు
ఆ వీడియోలో ఏముందంటే
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అత్యంత భారీగా ఫైటర్ జెట్స్ నిల్వచేసే కేంద్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అమెరికాలోని ఆరిజోన రాష్ట్రంలోని టక్సన్ ప్రాంతంలో డేవిస్ మోన్తాన్ అనే పేరుతో వైమానిక దళ స్థావరం ఉంది. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందినది.. ఇందులో నాలుగు వేలకు పైగా యుద్ధ విమానాలను భద్రంగా దాస్తారు. 2,600 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడి వాతావరణం అత్యంత శత్రు దుర్భేద్యంగా ఉంది. విమానాలను, బాంబర్లను భద్రంగా ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది.. ” చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సైనిక బలాన్ని అంతకంతకు పెంచుకుంటున్నది. అమెరికా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నది. ఇటీవల కాలంలో అమెరికా యుద్దాలు చేయలేకపోయినప్పటికీ.. ప్రపంచ శక్తిగా అమెరికా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఖచ్చితంగా తన ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోవాలి. అందుకోసమే అమెరికా ఇలా భారీ స్థాయిలో యుద్ధ విమానాలను భద్రంగా దాచుకుంటున్నది.. తన సార్వభౌమాధికారానికి ఏదైనా ఇబ్బంది కలిగితే.. ప్రపంచ దేశాల నుంచి ఏదైనా ఉపద్రవం పొంచి ఉంటే వెంటనే అమెరికా రెస్పాండ్ అవుతుంది. అందువల్లే ఈ స్థాయిలో యుద్ధ సామాగ్రిని భద్రంగా దాచుకున్నదని” విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా పై గతంలో ఉగ్రవాదులు దారులు చేసిన నేపథ్యంలో.. తన రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంది. ప్రతి ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో సింహభాగం రక్షణ విభాగానికి కేటాయిస్తోంది. అందువల్లే అమెరికా ఈ స్థాయిలో పరికరాలను భద్రపరచుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన రక్షణ సామర్థ్యాన్ని బయట పెట్టడం ద్వారా చైనాకు అమెరికా ఒక రకంగా షాక్ ఇచ్చినట్లు అయిందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్ పేర్కొంటున్నారు.
Also Read : పాకిస్తాన్ ప్రతీకార దాడులకి పాల్పడితే జరిగేదేంటి?

Here's a peek into the boneyard at Davis-Monthan where military aircraft go to be parted out, preserved for display, or be put on life support for future use. Working on a more detailed clip of what happens after you are "divested"…um I mean after an A-10 is "divested". pic.twitter.com/NLnNBU4jh0
— Tim Farmer (@timfarmer) March 27, 2025