Virat Kohli : టీమిండియాలో ROKO గా పేరుపొందిన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంచలన రికార్డులు సృష్టించారు. వీరిద్దరూ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. పైగా అతడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని నేరుగా చెప్పకుండా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తంగా తన వీడ్కోలు నిర్ణయాన్ని సంచలనంగా ప్రకటించాడు. దీంతో టీమ్ ఇండియాలో ఏదో జరుగుతోంది అనే చర్చ మొదలైంది. అసలు రోహిత్ ఎందుకు వీడ్కోలు పలికాడు? తెర వెనుక బిసిసిఐ పెద్దల హస్తం ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్చ ముగిసిన తర్వాత ఇప్పుడు మరో హాట్ టాపిక్ క్రికెట్ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
Also Read : మీ వల్లే మేమిలా.. సైన్యానికి విరాట్ కోహ్లీ హాట్సాఫ్!
టెస్టులకు రిటైర్మెంట్
రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్టు.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ ప్రజలకు ఆయన వెల్లడించారని.. జాతీయ మీడియాలో కథనాలు ప్రకారం అవుతున్నాయి..” రోహిత్ తీసుకొన్న నిర్ణయం ఇప్పటికే బీసీసీఐ పెద్దలకు షాకింగ్ లాగా ఉంది. దానిని మర్చిపోకముందే విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్టు వారితో చెప్పాడు. విరాట్ నిర్ణయంతో బోర్డు పెద్దలు కూడా ఒకసారి గా షాక్ కు గురయ్యారు. విరాట్ కోహ్లీ గనక లేకపోతే అనుభవ లేని జట్టు ఇంగ్లాండ్లో పర్యటించినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బోర్డు పెద్దలు విరాట్ కోహ్లీని కోరారు. దానికి విరాట్ కోహ్లీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. తుది సమాధానం విరాట్ కోహ్లీ నుంచి రావలసి ఉందని” క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు..విరాట్ కోహ్లీ టెస్టులలో అంతగా రాణించలేకపోతున్నాడు. కీలకమైన మ్యాచులలో విఫలమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోను అతడు అంతగా ఆకట్టుకోలేదు. అయితే నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. విశ్రాంతి కోసం అతడు ఆ నిర్ణయం తీసుకొని ఉంటాడని తెలుస్తోంది. జాతీయ మీడియాలు కూడా ఇదే తీరుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఇంగ్లాండ్ సిరీస్ వరకు విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడా.. లేదా రిటైర్మెంట్ ప్రకటించి తీరుతాడా అనేది.. చూడాల్సి ఉంది. అయితే విరాట్ కోహ్లీ లండన్ లో స్థిరపడేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని తెలుస్తోంది. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ శాశ్వతంగా పక్కకు తప్పుకున్నాడు.. టెస్ట్ లో నుంచి కూడా అతడు వైదొలిగితే.. కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం అవుతాడు.. వన్డే వరల్డ్ కప్ వరకు ఆడి.. ఆ తర్వాత క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది.
Also Read : వీర విహారం చేసే విరాట్ కెప్టెన్సీ ని ఎందుకు వదిలేసాడు.. ఇన్నాళ్లకు తెలిసిన అసలు నిజం!