Bigg Boss 6 Telugu- Inaya Sultana: కంటెస్టెంట్ ఇనయా తన లవ్ ఇంట్రెస్ట్ ఎవరో చెప్పేసింది. దాపరికం లేకుండా ఒక అబ్బాయి బాగా నచ్చేస్తున్నాడని బిగ్ బాస్ ముందు ఓపెన్ అయ్యింది. బుధవారం ఎపిసోడ్ లో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ బర్త్ డే నేపథ్యంలో ఇంటి సభ్యుల కోసం కేక్ పంపించారు. ఆ కేక్ కేవలం నలుగురు సభ్యులు మాత్రమే తినాలి. ఏ నలుగురు తినాలో ఓ నిర్ణయానికి రావాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ విషయంలో ఇంటి సభ్యులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. వారు నిర్ణయించుకునే లోపు ఇచ్చిన సమయం ముగిసిందని, ఆ కేక్ ఎవరూ తినడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించాడు.

తర్వాత కంటెస్టెంట్ ఇనయాను బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కి పిలిచాడు. ఆమె ముందు కేక్ ఉంచిన బిగ్ బాస్… అది తినాలంటే ఇంటి సభ్యుల గురించి చెప్పాలని కండీషన్ పెట్టాడు. ఈ క్రమంలో ఇనయా రెండు లవ్ ఎఫైర్స్ లీక్ చేసింది. మొదటగా తన లవ్ స్టోరీ చెప్పింది. నాకు రాజ్ అంటే ఇష్టమని కొందరు అంటున్నారు. కానీ సూర్య అంటే ఇష్టం. అతడు నా క్రష్. ఎందుకో తెలియదు కానీ, బాగా నచ్చేస్తున్నాడు, అంటూ సిగ్గు పడింది. బిగ్ బాస్ అడగగానే ఏకంగా తన లవ్ ఇంట్రెస్ట్ ఆమె బయట పెట్టడం విశేషంగా మారింది.
Also Read: Shruti Haasan: బెడ్ పై న్యూడ్ గా.. శృతి హాసన్ ప్రైవేట్ ఫోటో లీక్!
అలాగే కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ గురించి కొన్ని సీక్రెట్స్ లీక్ చేసింది. ఫస్ట్ నుండి శ్రీసత్య అంటే అర్జున్ ఇష్టపడుతున్న మాట వాస్తవమే. కానీ ఈ మధ్య అతడి దృష్టి మారింది. వాసంతి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వాసంతి కూడా అర్జున్ పట్ల పాజిటివ్ గా ఉన్నట్లు అనిపిస్తుందని, చెప్పుకొచ్చింది. హౌస్ లో ఉన్న రెండు ఎఫైర్స్ గురించి బిగ్ బాస్ అడగగానే ఇనయా సుల్తానా చెప్పేసింది. బిగ్ బాస్ ఆమెను మరొక ప్రశ్న కూడా అడిగారు. ఇంటి సభ్యుల్లో ఒక్కరు కూడా కేక్ తినడానికి నీ పేరు సూచించలేదు. దీనిపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు.

ఈ ప్రశ్నకు ఇనయా ఎమోషనల్ అయ్యింది. కంటెస్టెంట్స్ లో చాలా మంది నా పట్ల మంచి అభిప్రాయం కలిగిలేరు. నన్ను తొక్కేయాలని, వెనక్కి లాగాలని చూస్తున్నారు. అయినా నేను వెనకడుగు వేయను. హౌస్లోనే ఉంటా, గేమ్ ఆడితీరుతా, అని గట్టి విశ్వాసం ప్రకటించింది. ఇనయా సమాధానాలకు ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ ఆమెకు కేక్ ఇచ్చాడు. ఇష్టమైన ఇంటి సభ్యులతో దాన్ని షేర్ చేసుకోవచ్చని చెప్పారు. కాగా ఈ వారం నామినేషన్స్ లో కూడా ఇనయా ఉన్నారు. అయితే ఆమెకు ప్రేక్షకుల నుండి మద్దతు లభిస్తున్నట్లు సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా తెలుస్తుంది.
Also Read:Sukumar Remuneration: పుష్ప2 కోసం సుకుమార్ పారితోషికం ఎంతో తెలుసా?
[…] […]