Impact Of BRS In AP: తెలంగాణ ఉద్యమస్ఫూర్తి రగిలించి సక్సెస్ అయ్యారు కేసీఆర్. సుదీర్ఘ కాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. మూడోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. అదే స్పీడులో టీఆర్ఎస్ ను భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి.. దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ సక్సెస్ ఫుల్ లీడర్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రయాణంలో కేసీఆర్ కు ఎన్నో ముళ్ల కంచెలు దాటుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని ఢీ కొడుతున్నారు. ఇందులో సక్సెస్ అవుతారా? లేదా? అన్నది తెలియదు కానీ ఏపీలో మాత్రం ఉనికి చాటుకోవడం అంతా ఆషామాషీ కాదు. ఎందుకంటే ఆంధ్రాను దూషించి, ఇక్కడి ప్రజలను ధ్వేషించి తెలంగాణ సాధించారు. అది ఏపీ ప్రజల్లో విపరీతంగా నాటుకుపోయింది. ఏపీ రాష్ట్రానికి ఈ పరిస్థితికి కేసీఆరే ప్రధాన కారణమని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏపీలో విస్తరణ అనేది కత్తిమీద సామే.

అయితే ఏపీలోనూ ఏదైనా సాధ్యమే. ఎందుకంటే లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ ను ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ తారకమంత్రం ఏపీ ప్రజలు గుర్తించుకున్నారు. ఆయన మరణానంతరం జగన్ ను అక్కున చేర్చుకున్నారు. అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినా… సీబీఐ, ఈడీ కేసులు నమోదైనా ప్రజలు పట్టించుకోలేదు. అంతులేని విజయాన్ని కట్టబెట్టి సీఎం పీఠంపై కూర్చొబెట్టారు. చంద్రబాబుది అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో యువనేతగా ఎదిగా.. ఎమ్మెల్యే, ఆపై మంత్రిగా పనిచేసి మామ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంలో అందులోకి చేరారు. పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ నే పదవీవిచ్యుతుడ్ని చేశారు. అయినా సరే జనాలు ఎక్సెప్ట్ చేశారు. రెండుసార్లు సీఎంగా అవకాశమిచ్చారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నారు.
Also Read: Gambia Tragedy: గాంబియా విషాదం: ఫార్మా కంపెనీలూ… భారత్ కి చెడ్డ పేరు తేవొద్దు!
తెలుగునాట ఇటువంటి పరిణామాలు కోకొల్లలు. ఏపీ ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ అని ఉత్తరాధి రాష్ట్రాల నాయకులు అభివర్ణిస్తుంటారు. అయితే ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావం తరువాత ఈ పరిస్థితిలో కొంతమారింది. అయితే ఏపీ ప్రజల అభిరుచులు, అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. 2014 రాష్ట్ర విభజన సమయంలో అనుభవమున్న వ్యక్తిగా చంద్రబాబుకు అవకాశమిచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వమని కోరినందుకు జగన్ కు ఓటు వేశారు. ప్రజలకునమ్మించిన నాయకులు ఏపీలో సక్సెస్ అవుతుంటారు. పైగా కుల రాజకీయాల ప్రభావం ఎక్కువ. ఈ లెక్కన కేసీఆర్ ఇప్పుడు కుల రాజకీయం తెరపైకి తెచ్చే అవకాశముంది. వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ .. తన కేస్ట్ ప్రభావం అధికంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప జిల్లాలపై ఫోకస్ పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ స్ట్రాటజీ కరెక్టయ్యే అవకాశముంది. వాస్తవానికి వెలమ సామాజికవర్గంలో ఐక్యత ఎక్కువ. ప్రస్తుతం వైసీపీ, టీడీపీలో వెలమ నాయకులు కొనసాగుతున్నా.. వారి మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న టాక్ వినిపిస్తుంటుంది. దీనినే ఆసరా చేసుకొని బీఆర్ఎస్ ను విస్తరించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ గెలుపోటములే కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు అవకాశాలు కల్పిస్తాయన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ ఓటమి చెందితే దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశముంది. అటువంటప్పుడు వారికి బీఆర్ఎస్ నాయకత్వం అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ వైసీపీ కానీ ఓటమి చవిచూస్తే మాత్రం ధర్మాన ప్రసాదరావుకు నాయకత్వాన్ని అప్పగించి..ఎంటైర్ వైసీపీ నేతలను పార్టీలోకి రప్పించి నిర్వీర్యం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను భారతీయ రాష్ట్ర సమితిలోకి తేవాలని కేసీఆర్ వ్యూహం రూపొందించారు.మొత్తానికైతే కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలో విస్తరణకు తాత్కాలిక అడ్డంకులు ఉన్నా.. భవిష్యత్ లో మాత్రం చొచ్చుకెళ్లే అవకాశమైతే ఉంది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే పంచ్ వేసిన రేవంత్ రెడ్డి
[…] Also Read: Impact Of BRS In AP: కేసీఆర్ బీఆర్ఎస్.. ఏపీ, జగన్ పై… […]