Gambia Tragedy: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మందులు వేసుకోవాలి. అనారోగ్యం నుంచి మనల్ని కాపాడేవే ఈ మందులు. కానీ ఆ మందులు వికటిస్తే.. ఎక్స్ పైరీ అయితే మాత్రం పెను విషాదమే నెలకొంటుంది. అయితే ఈ మందులు కూడా మునుపటిలా క్వాలిటీగా రావడం లేదన్నది నిజం. మునుపు ఒక జ్వరం గోలి వేసుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు వేసుకున్నా తగ్గడం లేదు. అది శరీర ధర్మమో లేక.. మన ఆహార అలవాట్లకు మందులు పనిచేయడం లేదే ఏమో కానీ ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల ప్రయోజనాలు.. అనార్థాలు కూడా వచ్చిపడుతున్నాయి.

తాజాగా దగ్గు మందు తాగి కొందరు విద్యార్థులు మరణించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది.. ఆఫ్రికా ఖండంలోని గాంబ్రియా దేశంలో చిన్నపిల్లలు దాదాపు 66 మంది ఈ దగ్గుమందు తాగి చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దగ్గు నివారణకు మందు తాగితే ఉన్న ప్రాణమే పోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. దగ్గు పోతుందనుకుంటే ప్రాణం పోవడం అందరిలో ఆవేదన కలిగిస్తోంది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే పంచ్ వేసిన రేవంత్ రెడ్డి
ఈ దగ్గు మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ లు రావడమే వారి మరణానికి కారణమని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) తెలిపింది. కిడ్నీ సమస్యలు, అలర్జీలకు దారితీసి మరణించారని తేల్చింది. కొన్ని సిరప్ లు ప్రమాదకరమని ప్రకటన జారీ చేసింది. అవి వాడవద్దని సూచించింది.
ప్రొమెథెజైన్, ఓరల్ సొల్యూషన్, కాఫెక్స్ మాలిన్, బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్ మరియు మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ప్రమాకరమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీటి గురించి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పసిపిల్లల జీవితాలను బుగ్గిపాలు చేసిన మందుల్లో ఏం దాగి ఉందో అనే దాని మీద విచారణ చేపడుతున్నారు. పసిమొగ్గల జీవితాలను చిదిమేసిన మందుల వల్ల అందరిలో భయాందోళనలు పెరిగాయి. దగ్గు నివారణ కోసం తీసుకుంటే ప్రాణాలు పోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
గాంబియాలో 66 మంది విద్యార్థుల మరణానికి కారణమైన దగ్గుమందును తయారు చేసింది మన భారత్ కు చెందిన ‘మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ’ కావడం గమనార్హం. ఈ దగ్గుమంది తాగే మరణాలు సంభవించడంతో అందరూ భారత్ ను, భారతీయ ఫార్మాను విమర్శిస్తున్నారు.

కానీ ప్రపంచవ్యాప్తంగా.. ఆఫ్రికాలాంటి పేద దేశాలకు అతి తక్కువ ధరలో భారతీయ ఫార్మా పరిశ్రమ మెడిసిన్స్ అందజేస్తోంది. అమెరికా, యూరప్ లాంటి అగ్రదేశాల మందులతో పోలిస్తే 10వ వంతు తక్కువ ధరకే భారతీయ మెడిసిన్స్ అందుతున్నాయి. ఇక భారత్.. ప్రపంచానికే ఫార్మా ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ తయారయ్యే అన్ని మందులు ఎక్కడా కావు.. కరోనా వేళ మనం అమెరికాకు కూడా మందులు పంపిణీ చేసిన చరిత్ర ఉంది. ఒక్క దగ్గుమందు వల్ల ప్రాణాలు పోయాయని భారత్ ను అభాసుపాలు చేయడానికి లేదు. ఏదో పొరపాటు వల్ల అలా జరిగి ఉంటుంది. అలా అని పిల్లల మరణాన్ని తక్కువ చేయడానికి లేదు. మందుల తయారీలో మరిన్ని జాగ్రత్తలు పాటించి ఇలాంటి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క ఘటనలో భారత్ ఫార్మాను, భారత్ కు చెడ్డపేరు తేవొద్దని మన ఫార్మా ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.
Also Read:KCR Chandrababu: హాట్ రియాక్షన్: కేసీఆర్ జాతీయ పార్టీపై ఓ నవ్వు నవ్వి ఊరుకున్న చంద్రబాబు
[…] […]