New Parliament Building inauguration : భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి హోమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 25 రాష్ట్రాల ప్రతినిధులు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవనానికి మోడీ శంకుస్థాపన చేశారు. 64,500 చదరపు మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. అంతకుముందు లోక్ సభలో 545, రాజ్యసభలో 250 మంది కూర్చునే కెపాసిటీతో నిర్మించారు. ఇప్పుడు దానిని లోక్ సభలో 888, రాజ్యసభలో 384 కూర్చునే విధంగా నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనం త్రిభుజాకారంలో ఉంటుంది. . కొత్త లోక్ సభ ఛాంబర్ ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు. లోక్సభ స్పీకర్ కుర్చీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సెంగోల్ ను ప్రతిష్టాపించారు.
రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు కొత్త పార్లమెంటు భవనం లేదా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఉంది. ఇందులో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ భవనం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సచివాలయ భవనాలు, అనుకొని రాజ్ ఫత్ ఫ్లాట్లు ఉన్నాయి.
కింగ్ జార్జ్ 5 డిసెంబర్ 1911లో ఢిల్లీ దర్బార్ లో కలకత్తా కలకత్తా స్థానంలో ఢిల్లీ భారత దేశ రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు. కింగ్ జార్జ్ ఐదో పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని ఢిల్లీ దర్బార్ను నిర్వహించారు. మరియు దక్షిణాఫ్రికాలోని ప్రసిద్ధ వాస్తు సెల్ఫీ ఏర్పాటు కొత్త మహానగరాన్ని నిర్మించే బాధ్యతను ఏర్పరచుకున్నారు.
ఇక కొత్త పార్లమెంటుకు జాతీయగీతంతో పట్టాభిషేకం చేయనున్నారు. దాని పైకప్పులో రాష్ట్రపతి భవన్ లో ఉన్నటువంటి సాంప్రదాయ శైలి కార్పిటింగ్ ప్రెస్కో పెయింటింగ్ ఉన్నాయి. లోక్ సభ పైకప్పు నిర్మాణం పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతంలో ఉంటుంది. అంతేకాకుండా రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటులోని కొన్ని లక్షణాలను కాపాడేందుకు లోపలి గోడలపై శ్లోకాలు రాశారు. ఈ నిర్మాణానికి దోల్పూర్ రాయి ప్రధానంగా వాడారు.