https://oktelugu.com/

Adani – Ambani : బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ కిందకు.. అదానీ, అంబానీ పైకి.. ఒక్కరోజులో అసలేం జరిగింది?

ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.

Written By:
  • Rocky
  • , Updated On : May 28, 2023 / 09:29 AM IST
    Follow us on

    Adani – Ambani : వ్యాపారం అంటే లాభనష్టాలు మాత్రమే. లాభం వచ్చినవారు కాలర్ ఎగరేస్తారు. నష్టం వచ్చినవారు కిందకు చూస్తారు. ఇక ఆ స్టాక్ మార్కెట్ అయితే ఒక పట్టాన అర్థం కాదు. అయితే ఇంతటి గందరగోళంలోనూ మనం ఆసక్తిగా చూసేది ఎవరి సంపద పెరిగింది, ఎవరి సంపద కరిగింది, శ్రీమంతుడిగా నిలిచింది ఎవరు? అనే విషయాలను మాత్రమే. అందుకే కదా ముకేశ్ అంబానీ గురించి మీడియాలో వచ్చే వార్తలకు అంత ప్రాముఖ్యత.. మిగతా వార్తలకు మనం ఇవ్వలేం. అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్టు డబ్బు బలం, డబ్బే బలం.. అలాంటి డబ్బుతో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెడతారు. ఇందులో అదృష్టం కలిసి వస్తే కోట్లకు పడగలెత్తుతారు. రాకపోతే విజయ్ మాల్యా లాగా విదేశాలకు చెక్కేస్తారు. అయితే ఇలాంటి శ్రీమంతుల జాతకాలు ఒక్కరోజులోనే మారిపోతాయి. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ఆదాని గ్రూప్ షేర్లు ఎలా పడిపోయాయో మనం చూశాం కదా.. ఇప్పుడు అలాంటి నివేదికలు ఏవీ లేకున్నప్పటికీ ప్రపంచంలో తోపు అనుకునే కంపెనీలు ధమాల్ అని కింద పడిపోయాయి.

    కరిగిపోయింది
    ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల సంపద ఒక్కరోజులో కరిగిపోయింది. దానికి భిన్నంగా భారత్ బిలియనీర్ల సంపద పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బెర్నార్డ్ ఆర్నాల్డ్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ నుంచి వారెన్ బఫెట్ దాకా ప్రపంచ కుబేరుల సంపద గత 24 గంటల్లో భారీగా పడిపోయింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపదను భారీగా కోల్పోయారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్డ్ సంపద కరిగిపోవడంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన స్థానం రెండవ ర్యాంకు పడిపోయింది. ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
    పాపం.. అమెరికన్ వ్యాపారులు
    అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 1,63,909 కోట్లు కోల్పోయారు. ఆయన నికర సంపద 139 బిలియన్ డాలర్లు. ఎల్విఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ అర్నాల్డ్ వ్యక్తిగత సంపద 92 వేల కోట్లు కరిగిపోయి 192 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. టెస్లా కో ఫౌండర్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ 18,350 కోట్లు కోల్పోయారు. ఆయన వ్యక్తిగత సంపద 180 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త వారెన్ బఫెట్ వ్యక్తిగత సంపద 18,102 కోట్లు కోల్పోయారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత సంపద 113 బిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యక్తిగత సంపద 8,266 కోట్లు హరించుకుపోయింది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత నికర సంపద 125 బిలియన్ డాలర్లు. ఇక ప్రపంచ అపర్ కుబేరుల్లో భారతీయ బిలినియర్ గౌతమ్ అదానీ తిరిగి టాప్ 20 కుబేరుల జాబితాలోకి వచ్చారు. ఒక రోజులోనే ఆయన వ్యక్తిగత సంపద 4.38 బిలియన్ డాలర్లు పెరిగి 64.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత జనవరి నెలలో యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద హరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఫిబ్రవరిలో టాప్ 20 కుబేరుల జాబితాలో నుంచి గౌతమ్ వెళ్లిపోయారు. ఇక రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 45,380 కోట్లు పెరిగి 84.1 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ప్రస్తుతం టాప్ 20 కుబేరుల్లో ముఖేష్ 13వ స్థానంలో నిలిచారు. ఇక ఫార్మా రంగంలో ఉన్న వ్యాపారులు కూడా తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకొన్నారు.