https://oktelugu.com/

Dhanush & Nayantara : హీరో ధనుష్ మోసాన్ని బయటపెడుతూ నయనతార బహిరంగ లేఖ..ఇండస్ట్రీ లో లేడీస్ కి ఇంత అన్యాయమా?

లేడీ సూపర్ స్టార్ నయనతార, కాసేపటి క్రితమే హీరో ధనుష్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గతంలో విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్ లో 'నేను రౌడీనే' అనే చిత్రం తెరకెక్కింది

Written By: Vicky, Updated On : November 16, 2024 2:57 pm
Nayantara's open letter exposing hero Dhanush's fraud..Is it so unfair to ladies in the industry?

Nayantara's open letter exposing hero Dhanush's fraud..Is it so unfair to ladies in the industry?

Follow us on

Dhanush & Nayantara :  లేడీ సూపర్ స్టార్ నయనతార, కాసేపటి క్రితమే హీరో ధనుష్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గతంలో విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్ లో ‘నేను రౌడీనే’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శకుడు కాదు, ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియో ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు. నవంబర్ 18వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో ‘నేను రౌడీనే’ చిత్రంలోని చిన్న క్లిప్ ని వాడారు.

దీనికి నిర్మాత ధనుష్ చాలా ఫైర్ అయ్యాడు. నిర్మాతని అయిన నన్ను అడగకుండా, నా అనుమతి తీసుకోకుండా నా సినిమాలోని వీడియోని ఎలా వాడుకుంటారు అంటూ కోర్ట్ లో కేసు వేసి 10 కోట్ల రూపాయిల జరిమానా కట్టాలంటూ నోటీసులు పంపించాడు ధనుష్. దీనికి నయనతార మనసు చాలా నొచ్చుకుంది. ధనుష్ పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల బహిరంగ లేఖను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ఇంతై ఆ బహిరంగ లేఖలో ఏముందంటే ‘తండ్రి, అన్నయ్య సహకారంతో ఇండస్ట్రీ లోకి వచ్చి, ఒక మంచి నటుడిగా స్థిరపడిన ధనుష్ గారు, మీరు ఈ లేఖను చదివి నా ఆవేదన ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సినీ పరిశ్రమలో నాలాంటి ఆడవాళ్ళూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి, కష్టపడి ఈ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ పెళ్లిని మన సినీ పరిశ్రమకి చెందిన కొందరు కష్టపడి డాక్యుమెంటరీ గా చేసారు. ఈ డాక్యుమెంటరీ కోసం నా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మీకు నా మీద విపరీతమైన పగ ఉందని ఈమధ్యనే అర్థమైంది’.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కానీ మీరు నాపై చూపిస్తున్న ఆ పగ, ఈ డాక్యుమెంటరీ కోసం కష్టపడిన వాళ్ళ మీద పడుతుంది. నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘నేను రౌడీనే’. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం, నాకు మంచి పేరు రావడం నీకు నచ్చలేదని 2016 వ సంవత్సరంలోని ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో నీ అసంతృప్తిని చూసినప్పుడే నాకు అర్థమైంది. షూటింగ్ సమయంలో నేను నా భర్తతో కలిసి ఉన్న మధుర క్షణాలను నా మొబైల్ లో షూట్ చేసి అప్లోడ్ చేశాను. దానికి కూడా నువ్వు 10 కోట్ల రూపాయిల జరిమానా వేసావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో అర్థం అవుతుంది. పైకి మంచోడిలా నటిస్తూ, లోపల నా మీద ఇంత ద్వేషం పెంచుకున్నావ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఒక అమ్మాయి ఇంత దూరం వచ్చిందని నా మీద కక్ష్య కట్టావ్, దీనిని తమిళనాడు ప్రేక్షకులు క్షమిస్తారని నేను అనుకోను’ అంటూ చెప్పుకొచ్చింది నయనతార.