Viral Video: బయటకు వెళ్లాలంటే ఫుల్ గా భయం వేసేలా ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చాలు ఎండలకు భయపడాల్సిందే. ఉదయం 8 గం.ల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అందుకే ఎండలకు బయటకు వెళ్తే కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని మరీ వెళ్లాల్సిందే. లేదంటే ఎండ దెబ్బ తగలడం గ్యారంటీ. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే బయటకు వెళ్లాలి. లేదంటే ఎన్నో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీరు బయట ఏదైనా వస్తువులు తింటున్నారా?
బయట పనులకు ఒక్కసారి వెళ్లాలంటే కచ్చితంగా బాటిల్ తీసుకొని వెళ్తుంటారు. కానీ కొన్ని సార్లు బయటకు వెళ్లకపోతే బటయ నీరును తాగుతుంటారు. కానీ అంతకు మించి ఏదైనా తీసుకోవాలి అంటే భయపడాల్సిందే. మీరు ఒక వీడియో చూస్తే జన్మలో బయట ఏదైనా తినాలి అంటే వణుకుతారు. ఎండాకాలం జ్యూసులు, నిమ్మకాయ నీరు వంటివి తాగుతున్నారా? అది కూడా బయట కొనుగోలు చేస్తున్నారా? ముందు ఈ వీడియో చూడండి.
చూశారా? ఏదో ఒక రైల్వే స్టేషన్ ముందు షర్బత్ అమ్మే వ్యక్తి ఏ విధంగా నిమ్మరసం అమ్ముతున్నాడో. ఈయన చేసే పని చూస్తే ఇక జన్మలో అయినా ఏదైనా కొనుగోలు చేయాలి అనిపించదు. అందుకే సుచి శుభ్రత లేని ప్రజల వద్ద ఏదైనా కొనుగోలు చేయాలంటే భయపడాల్సిందే. ముంబైలోని రైల్వే స్టేషన్ వెలుపల నిమ్మరసం తయారు చేసిన ఈ జ్యూస్ మేకర్ ను చూస్తే జన్మలో నిమ్మకాయ నీరు ముట్టరు.
ఈ వైరల్ వీడియో ఖర్ఘర్ రైల్వే స్టేషన్ బయట ఒకస్టాల్ ఉంది. అందులో ఒక వ్యక్తి నిమ్మకాయ నీళ్లు తయారు చేసి అమ్ముతున్నాడు. కానీ ఈ సమయంలో అతడు చేస్తున్న పని జుగుప్సాకరంగా ఉంది కదా. జ్యూస్ తయారు చేసి అమ్ముతున్న ఆ వ్యక్తి అదే చేతితో ఎక్కడ పడితే అక్కడ తన శరీరాన్ని గోక్కుంటూ కనిపించారు కదా. మళ్లీ చేతులు కడుక్కోకుండా పరిశుభ్రత లేకుండా చేస్తున్న ఇలాంటి వారి వల్ల మీరు జాగ్రత్రగా ఉండాల్సిందే. లేదంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటారు. జర పైలం.
खारघर स्टेशनला रेल्वे प्रवाशांसाठी स्पेशल ज्यूस ची व्यवस्था करण्यात आली आहे… कडाक्याच्या उन्हात थंडगार आणि नमकिन असा ज्यूस तुमचा अंतरात्मा नक्कीच गारेगार करेल !
असे अनिधिकृत फेरीवाले नक्कीच लोकांचे आरोग्य बळकट करतील.धन्य ती @PanvelCorp आणि धन्य ते @Navimumpolice ! pic.twitter.com/U64qmLOrQ4
— अभिमन्यु (@Abhimanyus78) April 19, 2024