Pooja Hegde: స్టార్ హీరోతో లవ్ ఎఫైర్… పెళ్ళికి సిద్ధం అవుతున్న పూజా హెగ్డే?

పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లాడబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Written By: S Reddy, Updated On : April 20, 2024 4:28 pm

Pooja Hegde ready for marriage

Follow us on

Pooja Hegde: పూజా హెగ్డే రెండేళ్ల క్రితం వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అనూహ్యంగా వరుస ప్లాపులతో రేస్ లో వెనుకబడింది పూజా హెగ్డే. కొంతకాలంగా ఆఫర్లు లేక కాస్త సైలెంట్ అయ్యింది. అయినప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా పూజా హెగ్డే పై ఓ సంచలన వార్త వైరల్ గా మారింది.

పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లాడబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్ తో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పలుమార్లు కెమెరాకు చిక్కింది పూజా హెగ్డే. అతనితో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తుంది.

పూజా హెగ్డే ఎక్కడికి వెళ్లినా ఆమె పక్కనే రోహన్ మెహ్రా ఉండటం గమనార్హం. ఇటీవల అతనితో కారులో వెళ్తూ దొరికిపోగా ఆ ఫోటోలు, వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల పూజా హెగ్డే కొత్త ఇల్లు కొన్న సంగతి తెలిసిందే. ఆ హౌస్ ఇంటీరియర్ పనుల్లో రోహన్ మెహ్రా సహాయం చేస్తున్నాడట. రీసెంట్ గా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళింది.

ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి రోహన్ కూడా కనిపించాడు. పూజా హెడ్డే కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. దీంతో పూజా పేరెంట్స్ కూడా కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేదు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా పూజా హెగ్డే ఓ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ పుకార్లు అని తేలింది. కాగా నెక్స్ట్ పూజా హెగ్డే సాయి ధరమ్ తేజ్ కి జంటగా ఓ చిత్ర చేస్తున్నారని సమాచారం.