కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !

చూస్తుండగానే ఈ సంవత్సరం పూర్తవ్వబోతునట్లు అనిపిస్తుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఈ ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే. ఈ ఏడాది అనే కాదు, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అనే టెన్షనూ ఉంది. మరో పక్క కరోనా దెబ్బకు టాలీవుడ్ తన దిశ మార్చుకుని డిజిటల్ వైపు వెళ్ళిపోతుంది. పైగా ఏదో కొత్తధనం అంటూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలను తీస్తే.. అవి థియేటర్స్ లో చూస్తారా […]

Written By: admin, Updated On : August 15, 2020 12:18 pm
Follow us on


చూస్తుండగానే ఈ సంవత్సరం పూర్తవ్వబోతునట్లు అనిపిస్తుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఈ ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే. ఈ ఏడాది అనే కాదు, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అనే టెన్షనూ ఉంది. మరో పక్క కరోనా దెబ్బకు టాలీవుడ్ తన దిశ మార్చుకుని డిజిటల్ వైపు వెళ్ళిపోతుంది. పైగా ఏదో కొత్తధనం అంటూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలను తీస్తే.. అవి థియేటర్స్ లో చూస్తారా అనేది పెద్ద డౌట్ అయిపోయింది. అలాంటి సినిమాలు చూసే రోజులు పోయి.. వైవిద్యమైన కంటెంట్ తో వచ్చే సినిమాలే చూస్తాం అన్నట్లు మన ప్రేక్షకులు అత్యధికంగా డిజిటల్ లో వచ్చే డిఫరెంట్ వెబ్ సిరీస్ లకు బ్రహ్మరథం పడుతుండటం చూస్తే.. ఇప్పుడు ఆల్ రెడీ సగం షూట్ చేసి ఉన్న పక్కా రొటీన్ కమర్షియల్ సినిమాల పరిస్థితి ఏమిటనేది ఇక్కడ మరో అతిపెద్ద అయోమయం.

Also Read: మెగాస్టార్ తో సినిమా ఫిక్స్.. కానీ.. !

నిజంగానే కంటెంట్ సినిమాలకే ఆదరణ ఉంటే.. ఎన్నో విభిన్నమైన కథాంశాలతో వచ్చే కొత్త తరహా చిత్రాలకు ఇది శుభసూచికం. ఒక విధంగా ఒకప్పటి మన స్వర్ణయుగ చిత్రాలను గుర్తుకుతెచ్చే కాలం ఇది. నిజానికీ అప్పట్లో అనగా మాయాబజార్ మిస్సమ్మ కాలంలో.. అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ తరువాత జనరేషన్ మారింది. కాలం మారింది. కాలానుగుణంగా మూవీ మేకర్స్ కూడా మారుతూ వచ్చారు. అలా తెలియకుండానే తెలుగు సినిమా అంటే… రొటీన్ యాక్షన్ స్టోరీలు, లాజిక్ లేని బిల్డప్ సీన్స్ లు, అర్ధం పర్ధం లేని పంచ్ డైలాగ్ లు అనేంతలా మన తెలుగు సినిమాలను మన మేకర్స్ తీసుకువెళ్లారు. గడిచిన రెండు దశాబ్దాలలో నాలుగైదు చిత్రాలు మినహాయించి.. అన్ని కమర్షియల్ సినిమాలే అంటే.. మన టాలీవుడ్ పై కమర్షియల్ అనే ముద్ర ఎంతలా పడిందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: మన కథల పై వాళ్లకు మోజు ఎక్కువ !

అయితే కరోనా దెబ్బకు అలాంటి కమర్షియల్ ఫార్మాట్ తో వచ్చే సినిమాలకు ఇక మనుగడ ఉండదేమో.. ఇప్పటికే మన జనం వరల్డ్ సినిమాలను విపరీతంగా చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రేక్షకులు మీద డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాలనే రుద్దే ప్రయత్నం చేస్తే.. ఇక ఆ దర్శకుల కెరీర్ కష్టమే. అందుకే డైరెక్టర్లు.. కంటెంట్ నమ్ముకుని డిఫరెంట్ సినిమాలు చేయండి.అప్పుడే తెలుగు సినీపరిశ్రమలో మీకు స్థానం లభిస్తుంది. లేదంటే.. కెరీర్ సైడ్ అయిపోతుంది జర జాగ్రత్త.