IMF loan : దాయాది దేశం ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నప్పటికీ.. ఇంతటి దుర్మార్గాలకు ఒడి కడుతున్నప్పటికీ.. ప్రపంచ దేశాలు ముఖ్యంగా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్న పెద్ద దేశాలు వినోదం చూస్తున్నాయి. పైగా మన శత్రువు దేశానికి తెరవెనుక సహాయం చేస్తున్నాయి. పైకి ఉగ్రవాదాన్ని అరికడతామని.. ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి సహకరిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నప్పటికీ.. అంతిమంగా మాత్రం పాకిస్తాన్ దేశానికి తెరవెనుక సహాయం చేస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎటువంటి ఆర్థిక సహాయం చేయవద్దని భారత విన్నవించింది. దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా ఇచ్చింది. ఇతర దేశాల మద్దతు కూడా కూడగట్టింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధిపతి మనదేశంలో పర్యటించేందుకు వచ్చినప్పుడు.. ఇదే విషయాన్ని భారత్ వివరించింది. అప్పుడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అధిపతి భారత్ చెప్పిన వివరాలకు తల ఊపారు.. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో శత్రు దేశానికి సహాయం చేయబోమని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయారు. శత్రు దేశానికి 1 బిలియన్ డాలర్ల సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
Also Read : పాకిస్తాన్ ప్రపంచం నుంచి ఎంత అప్పు తీసుకుందంటే?
తెర వెనక శక్తులు వేరే
పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వన్ బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడాన్ని భారత్ తప్పు పడుతోంది. తాము ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే శత్రు దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం చేయడం అత్యంత దారుణమని అభిప్రాయపడుతోంది.. మరోవైపు పాకిస్తాన్ దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక భరోసా లభించడం వెనక తెరవెనక బలమైన శక్తులుగా ఉన్న దేశాలు కృషిచేశాయని భారత్ అనుమానిస్తోంది. ఎందుకంటే డ్రాగన్ దేశానికి ఆసియా మీద పట్టుదక్కాలంటే పాకిస్తాన్ సహకారం కచ్చితంగా కావాలి. అందువల్లే డ్రాగన్ పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. వ్యూహాత్మకంగా రహదారులు.. ఇతర వాణిజ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఇక అమెరికా కూడా గతంలో తన ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించింది. పాకిస్తాన్లో వారికి షెల్టర్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత జరిగిందో.. అప్పుడే శత్రుదేశంపై అగ్రరాజ్య ధోరణి కాస్త మారింది. లాడెన్ ను చంపిన తర్వాత అగరాజ్యం కాస్త దూరం జరిగినప్పటికీ.. తన సార్వభౌమాధికారం.. ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన శత్రుదేశానికి అగ్రరాజ్యం తెర వెనుక సహాయం చేస్తోంది. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దాయాది దేశానికి ఊహించని స్థాయిలో ఆర్థిక సహాయం లభించింది అంటే.. దాని వెనుక ఇతర శక్తుల పాత్ర లేదంటే నమ్మలేమని దౌత్య విభాగంలో పనిచేసిన మాజీ అధికారులు అంటున్నారు..”చైనాకు ప్రపంచ శక్తిగా ఎదగాలి అనే కోరిక ఉంది. అమెరికాకు తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే తలంపు కూడా ఉంది. భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఒకరకంగా జపాన్ దేశాన్ని పక్కన పెట్టింది. ఏకంగా మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ కూడా ఆసియాలో ఉన్న చైనాకు కంటగింపుగా ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తో అమెరికాకు అప్పుడప్పుడు అవసరాలు పడతాయి. అందువల్లే ఈ రెండు దేశాలు ఇలా చేశాయని” జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
Also Read : చివరికి దుబాయ్ కూడా ఒప్పుకోలేదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కథ ముగిసినట్టే..