Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యం లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్ననే వైజాగ్ లో ఘనం గా నిర్వహించారు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు వేలాది సంఖ్యలో హాజరయ్యారు..మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడిన మాటలు వింటే మెగాస్టార్ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.

ఇక అభిమానులను ఉత్తేజ పరుస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మెగాస్టార్ లో కనిపిస్తున్న ఉత్సాహం..మరియు డైరెక్టర్ బాబీ గురించి ఆయన చెప్తున్న మాటలు వింటుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థం అవుతుంది..మెగాస్టార్ స్పీచ్ లో వైజాగ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి వైజాగ్ గురించి మాట్లాడుతూ ‘నేను ఎప్పుడు వైజాగ్ కి వచ్చినా నాకు ఎంతో ఆహ్లదకరంగా అనిపిస్తుంది..రిటైర్ అయ్యినప్పుడు నేను ఇక్కడే స్థిరపడాలి అనుకుంటున్నాను..ఈమధ్యనే భీమిలి పొయ్యే దారిలో ఒక స్థలం ని కొనుగోలు చేశాను..ఇంటిని నిర్మించడం ప్రారంభించాలి..త్వరలోనే నేను కూడా మీతో పాటుగా వైజాగ్ వాసిని అవ్వబోతున్నాను’ అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు అభిమానులను ఎంతో ఉత్తేజపరిచాయి..అయితే చిరంజీవి కొన్న ఈ స్థలం విలువ దాదాపుగా 30 కోట్ల రూపాయిల వరకు చేస్తుందట..అత్యాధునిక సదుపాయాలతో ఈ ఇంటిని ఎంతో సుందరమయం గా నిర్మించబోతున్నాడు అట..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇక చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి..అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ కి ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకే జరిగాయి..ఇక టాక్ రావడం ఒక్కటే తరువాయి..మెగాస్టార్ మాస్ విద్వంసం వేరే లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.