Kiraak RP Chepala Pulusu Re Open: జస్ట్ కర్రీ పాయింట్ పెట్టి లక్షల వ్యాపారం చేస్తున్న కిరాక్ ఆర్పీ ఒక్కసారిగా వార్తలకు ఎక్కాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కిరాక్ ఆర్పీ రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టి కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మిన కిరాక్ ఆర్పీ పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాడు. కూకట్ పల్లి వంటి మంచి ఏరియా ఎంచుకున్నాడు. పెద్ద వంటశాల సిటీ బయట ఏర్పాటు చేసి రకరాకల చేపల పులుసు అందిస్తున్నాడు. అనతి కాలంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం అభివృద్ధి చెందింది. పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు మొదలయ్యాయి.

అయితే సడన్ గా కిరాక్ ఆర్పీ షాప్ క్లోజ్ చేశారు. ఆయన చేపల పులుసుకు అలవాటు పడిన జనాలు… తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం క్లోజ్ చేయడానికి గల కారణం వెల్లడించారు. డిమాండ్ కి తగ్గ సప్లై అందించలేకపోతున్నాము. కస్టమర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో నెల్లూరు వచ్చి చేపల పులుసు చేసే వంటవాళ్ళను, మరికొందరు వర్కర్స్ ని నియమించుకోబోతున్నాము. అందుకే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ క్లోజ్ చేశాము అన్నారు.
అది తాత్కాలికంగా మాత్రమే క్లోజ్ చేశామన్న కిరాక్ ఆర్పీ రీఓపెనింగ్ ఎప్పుడు ఉంటుందో వెల్లడించారు. ఎటూ సంక్రాంతికి వర్కర్స్ కి సెలవులు ఇవ్వాలి. కాబట్టి పండగ తర్వాత షాప్ రీఓపెన్ చేస్తాము. స్టాఫ్ ని పెంచడం జరిగింది. అలాగే గతంలో ఉన్న వంటలకు అదనంగా రెండు మూడు మెనూలో చేర్చడం జరిగింది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ పూర్తిగా క్లోజ్ చేశాము అనడంలో నిజం లేదని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. 2019లో నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్లు అదిరిందితో పాటు అడపాదడపా కామెడీ షోలు చేశారు. ఆ మధ్య దర్శకుడిగా ఓ మూవీ ప్రారంభించాడు. నిర్మాత మధ్య తప్పుకోవడంతో కిరాక్ ఆర్పీ మూవీ ఆగిపోయింది. ఆయన బుల్లితెరపై కనిపించడం లేదు. ఇటీవల మల్లెమాల సంస్థ మీద ఆరోపణలు చేస్తూ వార్తలకు ఎక్కాడు. మొత్తంగా క్రియేటివ్ ఫీల్డ్ వదిలేసి… వ్యాపారం వైపు అడుగులు వేశాడు.