Indian Railways: అక్కడ కూడా ఫోన్ వాడుతున్నారా? అయితే అంతే సంగతులు..

కొన్ని ప్రదేశాల్లో మొబైల్ నిషేధం అని బోర్డులు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మరీ పెడుతుంటారు. అయినా కూడా మన ఫోన్ లవర్స్ ఊరుకుంటారా? దాచుకొని మరీ వెళ్తుంటారు. కొన్ని మందిరాలకు వెళ్తే కూడా ఫోన్ ను అలో చేయరు.

Written By: Swathi, Updated On : March 20, 2024 1:13 pm

Indian Railways

Follow us on

Indian Railways: ఫోన్.. ఫోన్.. ఫోన్.. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్ తోనే కనిపిస్తారు చాలా మంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు కూడా. కనీసం బాత్ రూమ్ కు వెళ్లినా కూడా ఫోన్ తోనే వెళ్తున్నారు. ఇలా ప్రజల జీవితంలో భాగం అయింది ఫోన్. బస్ లో వెళ్లినా, కాలేజీలో చదివినా, ఉద్యోగం చేస్తున్న ఎందెందు వెతికినా అందందు దొరుకును ఈ మొబైల్.

కొన్ని ప్రదేశాల్లో మొబైల్ నిషేధం అని బోర్డులు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మరీ పెడుతుంటారు. అయినా కూడా మన ఫోన్ లవర్స్ ఊరుకుంటారా? దాచుకొని మరీ వెళ్తుంటారు. కొన్ని మందిరాలకు వెళ్తే కూడా ఫోన్ ను అలో చేయరు. అయినా కూడా తీసుకొని వెళ్తారు. ఫోటోలు తీసుకోరాదు అంటారు. అయినా కూడా తీస్తారు. ఇదిలా ఉంటే చెరువులు, సముద్రాలు, వంతెనల వద్దకు వెళ్లి రీల్స్, సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల ప్రాణాలకు ముప్పని తెలిసినా వినకుండా ప్రాణాలు తీసుకున్న వారు కూడా అనేకం.

ఇండియన్ రైల్వే ప్రజలకు మంచి సేవలను అందిస్తుంది. అయితే ప్రయాణం చేసేటప్పుడు టైమ్ పాస్ కు ఫోన్ వాడడం వేరు. కానీ ఫోన్ కంటిన్యూగా వాడుతూనే ప్రయాణం చేయడం వేరు. ఇలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్లాట్ ఫామ్ లపై, రైల్ ఎక్కుతూ, దిగుతూ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ను వాడుతూనే ఉంటారు. కనీసం జేబులో అయినా పర్స్ లో అయినా పాకెట్ లో అయినా పెట్టుకోండి అని పక్కన ఉన్న వారు చెప్పినా పట్టించుకోరు. దీని వల్ల కూడా కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు.

ప్లాట్ ఫామ్ లు దాటుతూ.. ఫోన్ లను వినియోగిస్తూ ప్రాణాలు వదిలేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ రైలు ఎక్కినా, దిగినా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే ట్రాక్ పై సెల్ఫీలు తీసుకున్నా కూడా జైలు శిక్ష తప్పదట. పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, ఫ్రీ వెడ్డింగ్ షూటులు, ఫోటొ గ్రీఫీలు తీసుకుంటే కటకటాల్లోకి వెళ్లాల్సిందే అంటున్నారు రైల్వే అధికారులు. మరి నిషిద్ధ ప్రదేశాల్లో ఫోన్ ను వాడకండి.. తంటాలు కొనితెచ్చుకోకండి.