Homeట్రెండింగ్ న్యూస్IAS Transfers: తెలంగాణభారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఇద్దరికి కీలక బాధ్యతలు... కొత్త సీఎస్‌గా ఆయనే..!

IAS Transfers: తెలంగాణభారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఇద్దరికి కీలక బాధ్యతలు… కొత్త సీఎస్‌గా ఆయనే..!

IAS Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌) సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న ఆయన, ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రామకృష్ణారావు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్థిక శాఖలో కీలక పాత్ర పోషించారు.

Also Read: ఆంధ్రజ్యోతికి ప్రకటనలు లేవ్.. వేమూరి రాధాకృష్ణపై కేసీఆర్ కు కోపం ఇంకా తగ్గలేదా?

అనుభవానికి పెద్దపీట..
రామకృష్ణారావు ఆర్థిక పరిపాలనలో తన నైపుణ్యంతో రాష్ట్రానికి సేవలందించారు. నల్లగొండ జాయింట్‌ కలెక్టర్, గుంటూరు కలెక్టర్‌గా పనిచేసిన ఆయన, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఆయన అనుభవం, సీఎస్‌ పదవికి ఎంపిక కావడానికి కారణమైనట్లు సమాచారం. ఆయన ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు.

శాంతి కుమారికి కీలక పదవి..
1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి శాంతి కుమారి, 2023 జనవరి 11 నుంచి తెలంగాణ సీఎస్‌గా సేవలందిస్తున్నారు. ఈ నెలాఖరున ఆమె పదవీ కాలం ముగియనుంది. పదవీ విరమణ తర్వాత ఆమెను చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఐఏఎస్‌ అధికారుల భారీ బదిలీలు
తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రముఖ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్‌ సెక్రటరీగా నియమించారు. శశాంక్‌ గోయెల్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వైస్‌ చైర్మన్‌గా, ఆర్వీ కర్ణన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, ఎస్‌. వెంకటాద్రి యాదగిరిగుట్ట ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతర నియామకాల్లో దాన కిషోర్‌ కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, శశాంక్‌ ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా, హరీష్‌ జెన్‌కో సీఎండీగా, సంగీత సత్యనారాయణ హెల్త్‌ డైరెక్టర్‌గా, జయేశ్‌ రంజన్‌ పరిశ్రమలు మరియు పెట్టుబడుల సీఈవోగా, ఇలంబర్తి హెచ్‌ఎండీఏ సెక్రటరీగా నియమితులయ్యారు.

పరిపాలనలో కొత్త ఊపిరి
ఈ బదిలీలు, నియామకాలు తెలంగాణ పరిపాలనలో కొత్త ఊపిరి తీసుకొచ్చే అవకాశం ఉంది. సీఎస్‌గా రామకష్ణారావు నియామకం, స్మితా సబర్వాల్‌ వంంటి అనుభవజ్ఞులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ మార్పులు రాష్ట్ర ఆర్థిక, సామాజిక, పరిపాలనా వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో రాబోయే రోజులు తేల్చనున్నాయి.

Also Read: తెలంగాణలో గులాబీ గర్జన… పోలీసులకు కేసీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular