KCR: మొత్తంగా చూస్తే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్ రెవెన్యూ వార్తాపత్రిక కంటే కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎన్నడు కూడా బయట పెట్టలేదు. ఒక రకంగా వేమూరి రాధాకృష్ణతో ఉన్న విభేదాల వల్లే కెసిఆర్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. ఆంధ్రజ్యోతికి మళ్లీ ప్రభుత్వ ప్రకటనలు మొదలయ్యాయి.. పార్టీ పరంగా కూడా ఆంధ్రజ్యోతికి భారీగానే ప్రకటనలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రకటనలపరంగా ఆంధ్రజ్యోతికి మోదమే.. అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఇప్పటికి కేసీఆర్ కు కోపం తగ్గలేదని తెలుస్తోంది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ప్రతిపక్ష పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. విశ్లేషణాత్మక కథనాలు రాసి కెసిఆర్ ప్రభుత్వానికి ఒకరకంగా చుక్కలు చూపించింది. ప్రతి విషయంలోనూ లోపాలను ఎత్తి చూపింది. అది ఒకరకంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అధికారంలోకి వచ్చిన తొలి పర్యాయంలోనే మీడియాను కిలోమీటర్ల లోతులో తొక్కుతా అని కేసిఆర్ వ్యాఖ్యానించింది బహుశా అందువల్లే కావచ్చు.
Also Read: వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా..కోల్ కతా పై పంజాబ్ సరికొత్త రికార్డు
ఇప్పుడు కూడా..
అధికారానికి దూరమైనప్పటికీ.. కెసిఆర్ ఇంకా రాధాకృష్ణ మీద కోపం తగ్గించుకోలేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆదివారం భారత రాష్ట్ర సమితి 25 ఏళ్ల వేడుకకు సంబంధించి ఈనాడు నుంచి మొదలు పెడితే వార్త వరకు జాకెట్ యాడ్స్ కుమ్ముకున్నాయి. ఇక సాక్షి అయితే మరో నమస్తే తెలంగాణ లాగా రెచ్చిపోయింది. ఆంధ్రప్రభ లో ఏకంగా స్పెషల్ ఎడిషన్ వేశారు. ఈనాడు కూడా భయం భయంతోనే భారీ కవరేజ్ ఇచ్చింది. అయితే ఆంధ్రజ్యోతి మాత్రం భారత రాష్ట్ర సమితి 25 ఏళ్ల వేడుక వార్తను ఎక్కడో కింద వేసింది. ఒక యాడ్ కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందని భావించిన భారత రాష్ట్ర సమితి.. ఉమ్మడి వరంగల్ పార్టీ పేరుతో ఒక జాకెట్ యాడ్ ఆంధ్రజ్యోతికి ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి టాబ్లాయిడ్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు.. కెసిఆర్ తో సమవుజ్జిల లాంటి నాయకులు వరంగల్లో చాలామంది ఉన్నారు. వారందరినీ కాదని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ప్రియారిటి ఇవ్వడం ఒక రకంగా అనేక సందేహాలకు తావిస్తోంది. బహుశా ఇది ” ఆబ్లిగేషన్” వార్త కావచ్చు. ఇక మిగతా పత్రికలు కవరేజ్ విషయంలో పోటీపడితే.. ఆంధ్రజ్యోతి మాత్రం బిఆర్ఎస్ 25 ఏళ్ల వేడుక కర్టెన్ రైజర్ వార్తను జస్ట్ లైట్ తీసుకుంది. ప్రకటనలు ఇవ్వలేదని కోపమో.. తనను పదేళ్లు ఇబ్బంది పెట్టాడని ఆగ్రహమో తెలియదు గాని.. రాధాకృష్ణ కేసీఆర్ ను పట్టించుకోలేదు. కెసిఆర్ కూడా రాధాకృష్ణను లెక్కలోకి తీసుకోలేదు. మొత్తంగా బావాబామ్మర్దుల మధ్య నిప్పు ఇంకా నివురు గప్పే ఉంది.
Also Read: ఉన్నట్టుండి మాల్దీవులకు వెళ్లిన SRH జట్టు.. కారణం ఏమై ఉంటుంది?