Kannappa : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేటు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మాత్రం ఏ రకంగాను వాళ్ళ సత్తా చాటుకోలేకపోతున్నారు. ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి సక్సెస్ లను సాధించడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మంచు విష్ణు (Vishnu) ఇప్పటికే 150 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ (Kannappa) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులను భాగం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రభాస్ ని సైతం ఈ సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్ కోసం తీసుకున్నారు.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య మంచు విష్ణు ఇస్తున్న ఇంటర్వ్యూలో ప్రభాస్ ని కొంతవరకు తక్కువ చేసి మాట్లాడుతుండడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీని వల్ల కన్నప్ప సినిమా మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కనుక బాగా లేకపోయిన, ఏమాత్రం కొంచెం అతిగా అనిపించినా కూడా ప్రభాస్ కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సినిమాలో నటించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూసిన ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రేజ్ వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ‘రాజా సాబ్’ ని దాటేసిన ‘కన్నప్ప’..ఊహించని వింత పరిణామం!