Madhya Pradesh : మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రాంతాలను బట్టి పలురకాల ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్న వివిధ ఆచారాలు, సంప్రదాయాలు తరచూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే జ్ఞానం కలుగుతుంది, మరికొన్నింటిని చూసి మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఈ వింత, విచిత్రమైన ఆచారాలలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులో ఉన్న ‘భార్యలను అద్దెకు ఇవ్వడం’ అనే ఆచారం. ఇది చాలా మందికి నమ్మశక్యం కాకపోయినా ఈ ఆచారం నిజమే.
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో కొన్ని గ్రామాల్లో భర్తలు తమ భార్యలను ‘అద్దెకు’ ఇస్తుంటారు. దీనిని ‘ధదీచ ప్రాత’ అని పిలుస్తారు. ఈ ఆచారం ప్రకారం ఒక భర్త తన భార్యను మరో వ్యక్తికి కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అద్దె తీసుకునే వ్యక్తి భర్తకు రూ.10 లేదా 100 స్టాంపు కాగితాలపై సంతకాలు చేస్తారు. ధర నిర్ణయించి అద్దెకు తీసుకుంటారు. ఈ విధంగా భార్యలను అద్దెకు ఇచ్చిన తర్వాత పూర్తి అద్దెకు తీసుకున్న వారితే భార్యల బాధ్యత. దీని ద్వారా అద్దె తీసుకునే వారు సదరు భర్తలకు జీతం చెల్లిస్తారు.
గ్వాలియర్ రాజపుత్రులు ఈ ఆచారంలో భాగంగా ఎక్కువగా ఉంటారు. వీరు ధనవంతులుగా ఉంటారు కాబట్టి, వారి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు గ్రామంలోని యువ మహిళలను అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఒక మహిళకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె చెల్లించడం జరిగేది. వయస్సు తక్కువ ఉన్న మహిళలకి డిమాండ్ ఎక్కువగా ఉంటే, వయస్సు పెరిగిన వారికి డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇలా అద్దెకు తీసుకెళ్లిన మహిళలకు పిల్లలు పుడితే, ఆ పిల్లల బాధ్యత కూడా అద్దెకు తీసుకున్న వారి మీద ఉంటుంది. అదేవిధంగా, పెళ్లి కాని మహిళలు కూడా ఈ ఆచారంలో భాగంగా అద్దెకు తీసుకోవడం జరుగుతుంది.
ఈ ఆచారం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో మాత్రమే కాకుండా, గుజరాత్ లో కూడా ఉండడం గమనార్హం. వింతైన ఈ ఆచారం ఎంతగానో ప్రాచుర్యం పొందినప్పటికీ, అక్కడి ప్రజలు దీనిని ఆపడానికి ప్రయత్నాలు చేసినా, వారు ఇంకా దీనిని కొనసాగిస్తున్నారు. దీనివల్ల కలిగే నైతిక, సామాజిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా, ఈ ఆచారం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కొనసాగిస్తూ వచ్చాయి. ఈ విధమైన ఆచారాలు మన దేశంలో ఉన్నప్పుడు, వాటి వల్ల కలిగే సమస్యలు, వాటిని నిషేధించడంలో వచ్చే ప్రతికూలతలు ప్రజల మనోభావాలు, సాంప్రదాయాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. కానీ, ఈ ఆచారం ఇప్పటికీ అంగీకరించబడుతుండడంతో దీని వెనుక ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి.