Delhi Exit Polls: వివిధ సంస్థలు అంచనా వేసిన ఫలితాల ప్రకారం చూసుకుంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బిజెపి అధికారాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనేక సంస్థలు తమ ఫలితాలలో వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలో చాలావరకు ఓటర్లు బిజెపి వైపు నిలబడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఓటర్లు బిజెపికి పట్టంకట్టబోతున్నారు అని తెలియడంతో.. కాషాయ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటారు.. పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం బిజెపి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ 10 నుంచి 19, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని తెలుస్తోంది.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 48.5 నుంచి 52.5% వరకు ఓట్లను సాధిస్తోందని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 నుంచి 40.5 శాతం ఓట్లు లభిస్తాయని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు చెబుతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వస్తాయని.. ఓటింగ్ శాతం 6.5 నుంచి 8.5% వరకే ఉంటుందని తెలుస్తోంది. ఇతరులు 3.1 నుంచి 5.1 శాతం వరకు ఓట్లు పొందడానికి అవకాశం ఉంటుందని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు అంచనా వేస్తున్నాయి..
మహిళా ఓటర్లు ఆ పార్టీ వైపే..
పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. మహిళా ఓటర్లు మాత్రమే ఆప్ వైపు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో 8.3 శాతం మంది మాత్రమే బిజెపిపై నమ్మకంతో ఉన్నారని సమాచారం.. మహిళల. విభాగంలో ఆప్ కు 50.20 శాతం మంది జై కొట్టారట. భారతీయ జనతా పార్టీకి 41.90%, కాంగ్రెస్ పార్టీకి 6.10%, ఇతరుల వైపు 1.90 శాతం మద్దతు ఇస్తున్నారని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు చెబుతున్నాయి. బిజెపి వైపు బ్రాహ్మణులు, రాజ్ పుత్, యాదవ్, జాట్, బనియా, కాశ్మీరీ పండిట్లు, గుప్త సామాజిక వర్గాలు నిలిచారని తెలుస్తోంది.. అగ్రవర్ణాలు, వెనుకబడిన ఓ బీసీలు, దళితులు ఆప్ వైపు ఉన్నారట.
మిగతా వర్గాలు
హిందువులు, జైన్ లు, ఇతరులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. సిక్కులు, ముస్లింలు ఆప్ కు జై కొట్టారు.. ఉత్తరాది, హర్యానా బి, పహడి, పూర్వాంచల్ ప్రాంతాలు బిజెపికి మద్దతు ఇచ్చాయి. పంజాబీలు, దక్షిణాది ప్రజలు, సిక్కులు, యాదవ్, చమార్, వాల్మీకి సామాజిక వర్గాల వారు ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు. అయితే అధికారంలోకి బిజెపి వస్తున్నప్పటికీ బూస్ట్ పాపులర్ నాయకుడిగా అరవింద్ కేజ్రివాల్ గెలిచినట్టు సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే మెజారిటీ ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.