Geetha Govindam 2: 2018లో విడుదలైన గీత గోవిందం అతిపెద్ద విజయం నమోదు చేసింది. విజయ్ దేవరకొండ స్టార్డం మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రమది. హీరోయిన్ రష్మిక మందానకు గట్టి పునాది వేసింది. ఆమెకు యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. దర్శకుడు పరశురామ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. గీత గోవిందం థియేటర్స్ వారాల పాటు స్టూడెంట్స్ తో నిండిపోయాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ లాభాలు పంచింది. అత్యధిక లాభాలు తెచ్చిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో గీత గోవిందం చోటు దక్కించుకుంది. యూఎస్ బాక్సాఫీస్ కూడా షేక్ చేసింది. గీత గోవిందం చిత్రానికి ఘన చరిత్ర ఉంద

కాగా ఈ కాంబో రిపీట్ అవుతుంది. విజయ్ దేవరకొండ-పరశురామ్ మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన పరశురామ్ , విజయ్ దేవరకొండ, దిల్ రాజు కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ, మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండతో పరశురామ్ గీత గోవిందం 2 చేయనున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ అదేనా లేక కొత్త కథతో వస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అప్డేట్ లో పొందుపరిచారు. కాగా నాగ చైతన్యతో పరశురామ్ మూవీ చేయాల్సింది. నాగేశ్వరరావు టైటిల్ తో నాగచైతన్యకు ఆయన ఓ కథ వినిపించారు. ఓకే చెప్పిన చైతు పూర్తి స్క్రిప్ట్ పట్ల అసంతృప్తి చెందారు. దీంతో పరుశురామ్ తో మూవీ క్యాన్సిల్ చేసుకున్నాడనే ప్రచారం జరిగింది.

ఆ వార్తలు వచ్చిన రోజుల వ్యవధిలో పరశురామ్ హీరో విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడం ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో నాగ చైతన్యతో అనుకున్న కథనే విజయ్ దేవరకొండతో చేస్తున్నారా? లేక ఇది ఫ్రెష్ స్టోరీనా? గీత గోవిందం 2 నా? అనే పలు సందేహాలు తెరపైకి వచ్చాయి. దీనిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు విజయ్ దేవరకొండ వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ఖుషి షూట్ చివరి దశకు చేరుకుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ ప్రకటించారు.
Very happy to announce that we are collaborating with blockbuster combination of The #VijayDeverakonda @TheDeverakonda & @ParasuramPetla for our upcoming film. 💥💥💥
Stay tuned for more updates… pic.twitter.com/WQfyhPFXS5
— Sri Venkateswara Creations (@SVC_official) February 5, 2023