Amigos Pre Release Event: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘భింబిసారా’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే..వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా పునర్జన్మని ఇచ్చింది, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపుతో వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన హీరో గా చేసిన ‘అమిగోస్’ అనే చిత్రం ఈ నెల 10 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిన్న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా ఎన్టీఆర్ ఈ చిత్ర డైరెక్టర్ గురించి మాట్లాడిన మాటలను చెప్పుకోవాలి,ఆయన మాట్లాడుతూ ‘ఇంజనీరింగ్ పూర్తి చేసి చేతిలో జాబ్ ఆఫర్ ఉన్నప్పటికీ కూడా సినిమానే తన కెరీర్ అని అనుకోని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వ్యక్తి రాజేందర్.అతనికి సినిమా అంటే ఎంత అభిమానం అనేది ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను.ఈ చిత్రం ప్రారంభం అయ్యే ముందు ఆయన తల్లి చనిపోయారు, ప్రారంభమై సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకున్న సమయం లో తండ్రి కూడా చనిపోయారు, జన్మనిచ్చిన తల్లితండ్రులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు..కానీ ఆయన ఆ బాధ ప్రభావం ని సినిమా మీద చూపించకుండా, చాలా ఫోకస్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు..ఆయన తల్లితండ్రులు ఎక్కడున్నా ఈ నెల 10 వ తారీఖున ‘అమిగోస్’ సక్సెస్ ని చూసి సంతోషిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఇంకా ఆయన తన అన్నయ్య కళ్యాణ్ రామ్ మరియు సినిమా గురించి మాట్లాడుతూ ‘మా నందమూరి కుటుంబం లో ఎప్పుడూ కొత్త తరహా సినిమాలు చెయ్యడానికి ముందు ఉంటాడు మా అన్నయ్య కళ్యాణ్ రామ్..ఆయనకీ ఒక మాస్ హిట్ వస్తే చూడాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది, ఆ కోరిక గత ఏడాది భింబిసారా తోనే తీరిపోయింది..ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో సక్సెస్ సాదిస్తుందని ఆశిస్తున్నాను..ఇక ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహ రెడ్డి’ సినిమాలతో రెండు హిట్స్ ని ఒకేసారి అందుకున్నారు మైత్రి మూవీ మేకర్స్..నేను కొరటాల శివ వీళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ ఉంటాము..వీళ్ళకి సుడి మామూలుగా లేదని..నాకు తెలిసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకేసారి రెండు సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్స్ అందుకున్న నిర్మాతలు ఎవ్వరూ లేరు, ఒక్క మైత్రి మూవీ మేకర్స్ తప్ప, ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.