Homeఅంతర్జాతీయంChina Spy Balloon: ప్రపంచంపై డ్రాగన్ నిఘా కన్ను.. ఆ బెలూన్ వదలడం వెనుక కథ...

China Spy Balloon: ప్రపంచంపై డ్రాగన్ నిఘా కన్ను.. ఆ బెలూన్ వదలడం వెనుక కథ అదే

China Spy Balloon: కోవిడ్ వల్ల ప్రపంచం రికవరీ అయితే.. చైనా లో ఇంకా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ డ్రాగన్ దేశానికి బుద్ధి రావడం లేదు.. జనం మరణిస్తున్నా గుణ పాఠాలు నేర్చుకోవడం లేదు.. మరోవైపు వృద్ధిరేటు మందగిస్తోంది.. నిర్మాణరంగం కుదేలవుతోంది.. కంపెనీలు మొత్తం ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.. ఇలాంటి స్థితిలో ఏ దేశమైనా తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటుంది.. తన తప్పుల్ని సరిదిద్దుకొని కొత్త విధానాల వైపు పయనిస్తుంది. అదేంటో గాని చైనాకు ఇన్ని వరుస విపత్తులు ఎదురవుతున్నా లేష మాత్రమైనా మార్పు రావడం లేదు. దీనికి తోడు ప్రపంచంపై నిఘా పెడుతోంది. ఏకంగా బెలూన్ల రూపంలో ఉన్న ఎయిర్ షిప్ లను ఎగరేస్తోంది.

China Spy Balloon
China Spy Balloon

ఇలాంటి ఎయిర్ షిప్ తమ దేశం మీద ఎగురుతున్నట్టు గమనించిన అమెరికా దానిని యుద్ధ విమానాల సహాయంతో పేల్చేశారు.. మొదట దానిని గ్రహాంతర వాసి అనుకున్నారు. పేలిన బెలూన్ ను చూడగా అందులో రకరకాల పరికరాలను పరిశీలించారు.. అధునాతన కెమెరాలు.. వీడియో రికార్డు చేసే పరికరాలు ఉన్నట్టు గమనించారు.. అయితే ఈ పరికరాలు వేగంగా ఫోటోలు తీసి అవి ఎక్కడి నుంచి అయితే ప్రయోగించబడ్డాయో అక్కడికి వాటిని పంపిస్తున్నాయి.. వాటిని నిలువరించడం సాధ్యం కాని సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయడంతో అమెరికా అధికారులు ఆ ఫోటోల అప్ లోడ్ ను నిలువరించలేకపోయారు.. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రయోగించబడిందో… దాని రిమోట్ సెన్సింగ్ ఆధారంగా అది చైనా దేశానికి సంబంధించినదని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అమెరికా ఉపరితలం మీద ఎగురుతున్న ఎయిర్ షిప్ కేవలం అమెరికాను మాత్రమే ఉద్దేశించి ప్రయోగించినది కాదు. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ మీదుగా ఇది అమెరికా వెళ్ళింది. భారత్ తో పాటు జపాన్ దేశాలు ఎందుకు గుర్తించలేకపోయాయి?

60 వేల అడుగుల ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఎయిర్ షిప్ లాంటి దానిని సివిల్, మిలటరీ గ్రౌండ్ రాడార్లు గుర్తించలేవు. ఎయిర్ షిప్ ఇలాంటివేడని విడుదల చేయదు కాబట్టి హీట్ సిగ్నేచర్ అంటూ ఏదీ ఉండదు.. కాబట్టి ఉపగ్రహాలు కూడా గుర్తించలేవు. ఎయిర్ షిప్ లేదా పెద్ద పెద్ద బెలూన్లను గుర్తించాలి అంటే భూ దిగువ కక్ష్యలో ఉండే శాటిలైట్లు కావాలి.. వాటిని నియర్ ఎర్త్ ఇమేజింగ్ టెక్నాలజీ లు గుర్తించగలవు. కానీ ఇది చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి మన దేశంతో పాటు జపాన్ దగ్గర లేదు కాబట్టి గుర్తించలేకపోయాయి. అమెరికా దగ్గర ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి వెంటనే గుర్తించగలిగింది. దానిని మానిటర్ చేయగలుగుతున్నది. ప్రస్తుతం అమెరికా, జపాన్, భారత్ చైనా కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి… ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎలాంటి టెక్నాలజీని వాడి దెబ్బతీయవచ్చు? అనే కోణంలో చైనా ఈ ప్రయోగం చేసింది. యుద్ధం అంటూ వస్తే ఇదే ప్రయోగించి వైరస్ ను విడవవచ్చు.. లేదా పరిమితి పరిధిలో ప్రభావం చూపగలిగే స్ట్రాటజిక్ అణు బాంబులను ఉపయోగించవచ్చు.

China Spy Balloon
China Spy Balloon

ఈ బెలూన్ ను ధ్వంసం చేసిన అనంతరం అమెరికా చైనా పై నిరసన తెలిపింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం అది కేవలం వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించినది అని, నియంత్రణ తప్పి అమెరికా భూభాగం వైపు ప్రయాణించిందని వివరణ ఇచ్చింది. దీని మీద తాము విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నది. చైనా అధికారులు ఇచ్చిన వివరణలోనే అది కంట్రోల్ తప్పింది అనే పదం వాడింది కాబట్టి అది బెలూన్ కాదు కంట్రోల్ ఎయిర్ షిప్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయింది.. చాలా కాలం తర్వాత అమెరికా స్టేట్ సెక్రటరీ అయిన ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్న సందర్భంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు మరింత క్షీణించి అది అతడి పర్యటన రద్దు చేసుకునే దాకా వెళ్ళింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version