Balagam Collections : 13వ రోజు చరిత్ర సృష్టించిన ‘బలగం’.. మొదటి రోజు కంటే మూడింతలు ఎక్కువ వసూళ్లు!

Balagam Collections : రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘బలగం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ కలలో కూడా ఊహించని అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఒక సినిమాని ఏ రేంజ్ లో ఆదరిస్తారో అని చెప్పడానికి క్లాసిక్ ఉదాహరణగా నిలిచింది బలగం చిత్రం.ప్రముఖ కమర్షియల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఎలాంటి లాభం ఆశించకుండా తన మాతృ భూమి తెలంగాణ కి సంబంధించిన సంస్కృతి ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం […]

Written By: NARESH, Updated On : March 15, 2023 10:11 pm
Follow us on

Balagam Collections : రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘బలగం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ కలలో కూడా ఊహించని అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఒక సినిమాని ఏ రేంజ్ లో ఆదరిస్తారో అని చెప్పడానికి క్లాసిక్ ఉదాహరణగా నిలిచింది బలగం చిత్రం.ప్రముఖ కమర్షియల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఎలాంటి లాభం ఆశించకుండా తన మాతృ భూమి తెలంగాణ కి సంబంధించిన సంస్కృతి ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు.

కానీ ఆయనకీ కమర్షియల్ గా రీసెంట్ గా విడుదలైన అన్నీ సినెమాలకంటే లాభాలను మూటగట్టుకునేలా చేసింది ఈ చిత్రం.మొదటి రోజు ఓపెనింగ్ చాలా తక్కువే.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం 55 లక్షల రూపాయిల ఓపెనింగ్ మాత్రమే దక్కింది.కానీ రెండవ రోజు నుండి కలెక్షన్స్ మొదటి రోజు కంటే పెరుగుతూ వచ్చింది.టాక్ జనాల్లో బాగా వెళ్ళిపోతూ ఉండడం తో ఆడియన్స్ డిమాండ్ ని గమనించి థియేటర్స్ సంఖ్య కూడా బాగా పెంచేశారు.

అలా సాగుతున్న ఈ చిత్ర బాక్స్ ఆఫీస్ ప్రయాణం గత రెండు రోజుల నుండి తారాస్థాయికి చేరుకుంది.ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు సైతం కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.నిన్న 88 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా, నేడు (13 వ రోజు) కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అంటే మొదటి రోజు వసూళ్ల కంటే దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ అన్నమాట.

మొత్తం మీద 13 రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇందులో కేవలం నైజాం ప్రాంతం నుండి వసూళ్లు 9 కోట్ల రూపాయిల గ్రాస్ అట.ఇది మామూలు సంచలనం కాదు.రోజు రోజుకి వసూళ్లు పెరుగుతూ పోతున్న ఈ సినిమాకి ఈ వీకెండ్ అద్భుతంగా కలిసొచ్చే అవకాశం ఉంది, ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఇప్పట్లో చెప్పడం కష్టమే.