https://oktelugu.com/

Babu Mohan: బ్రహ్మానందం, కోటాతో బాబు మోహన్ కి ఎక్కడ చెడింది… స్టార్ కమెడియన్ డామినేషన్ కి అంత భయపడ్డాడా?

కోట-బ్రహ్మానందం-బాబు మోహన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. వందల చిత్రాల్లో కలిసి నటించడం వలన మంచి సంబంధాలు ఉండేవి. ఈ ముగ్గురు నటులు ఎంత బిజీ అంటే... రోజుకు 15-16 గంటలు పని చేసేవారు. ఏడాదికి 50కి పైగా సినిమాల్లో నటించేవారు. ప్రస్తుతం కోటా, బ్రహ్మానందం, బాబు మోహన్ పెద్దగా నటించడం లేదు. కోటాకు వృద్ధాప్యం వచ్చేసింది. సరిగా మాట్లాడలేకపోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 17, 2024 / 02:08 PM IST

    Babu Mohan

    Follow us on

    Babu Mohan: 90లలో తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు కామెడీ త్రయం కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్. ప్రతి సినిమాలో దాదాపు వీరు ఉంటారు. బ్రహ్మానందం, బాబు మోహన్ దాదాపు ఒకే సమయంలో పరిశ్రమకు వచ్చారు. కోటా వీరిద్దరి కంటే సీనియర్. కోటా-బ్రహ్మానందం,-బాబు మోహన్ లది సూపర్ హిట్ కాంబినేషన్. కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలతో పాటు విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేసేవాడు. బ్రహ్మానందం, బాబు మోహన్ కేవలం కమెడియన్స్ గా ప్రసిద్ధి చెందారు.

    కోట-బ్రహ్మానందం-బాబు మోహన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. వందల చిత్రాల్లో కలిసి నటించడం వలన మంచి సంబంధాలు ఉండేవి. ఈ ముగ్గురు నటులు ఎంత బిజీ అంటే… రోజుకు 15-16 గంటలు పని చేసేవారు. ఏడాదికి 50కి పైగా సినిమాల్లో నటించేవారు. ప్రస్తుతం కోటా, బ్రహ్మానందం, బాబు మోహన్ పెద్దగా నటించడం లేదు. కోటాకు వృద్ధాప్యం వచ్చేసింది. సరిగా మాట్లాడలేకపోతున్నారు. బ్రహ్మానందం ఆ మధ్య అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు.

    సినిమాలు బాగా తగ్గించిన బ్రహ్మానందం ఆచితూచి నటిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాక బాబు మోహన్ నటనపై దృష్టి తగ్గించారు. గత ఏడాది విడుదలైన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీలో ఓ పాత్ర చేశాడు. అయితే కోటా, బ్రహ్మానందంలతో బాబు మోహన్ కి విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది. ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ ని ఈ ప్రశ్న అడగ్గా… ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    అన్నదమ్ములు , భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలు వస్తున్నాయి… మేమెంత. షూటింగ్ సెట్స్ లో మా మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తేవి. దాంతో గొడవలు పడేవాళ్ళం. ఎంత పెద్ద గొడవ జరిగినా అది తాత్కాలికమే. వెంటనే దాన్ని సెటిల్ చేసుకునేవాళ్లం. నేను, కోటా, బ్రహ్మానందం ఒకే ప్లేటులో తినేవాళ్ళం. కోటాను నేను అన్న అనేవాడిని. బ్రహ్మానందం నేను బావా అని ఒకరినొకరం పిలుచుకునేవాళ్ళం.

    అవుట్ డోర్ షూటింగ్స్ లో కోటా , నాకు రెండు రూమ్స్ బుక్ చేసేవాళ్ళు. కానీ ఒక్క రూమ్ లోనే ఇద్దరం ఉండేవాళ్ళం. బయట ఎలా ఉన్నా పని విషయంలో చాలా సీరియస్ గా ఉండేవాళ్ళం. బ్రహ్మానందం ఎక్కడ డామినేట్ చేస్తాడో అనే భయం నాలో ఉండేది. అందుకే బాగా నటించాలి అనుకునేవాణ్ణి. ఇక కోటాతో నటించేటప్పుడు నాకు పిల్ల బచ్చాను అనే భావన కలిగేది. కానీ చాలా అలర్ట్ గా ఉండేవాడిని అన్నారు. రోజుకు మేము 5,6 షూటింగ్స్ లో తీరిక లేకుండా పాల్గొనేవాళ్ళం.

    నటన మీద దృష్టి తప్పితే కొట్టుకోవాలి, గిల్లుకోవాలి, గొడవ పడాలి అనే భావన మాలో ఉండేది కాదని… బాబు మోహన్ ఆ రోజులు గుర్తు చేసుకున్నాడు. కోటా ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన్ని తరచుగా బ్రహ్మానందం, బాబు మోహన్ వెళ్లి కలుస్తారు. కాసేపు ముచ్చటించి వస్తారు. కోటాకు అసిస్టెంట్ గా బాబు మోహన్ చాలా ఫేమస్. బ్రహ్మానందం కూడా కొన్ని సినిమాల్లో కోటా అసిస్టెంట్ రోల్స్ చేశాడు.

    అహ నా పెళ్ళంట మూవీలో పరమ పిసినారి లక్ష్మీపతి పాత్ర కోటా చేయగా… ఆయన పాలేరు పాత్రలో బ్రహ్మానందం అద్భుతం చేశాడు. ఆ మూవీలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ పండించే కామెడీ ఎవర్ గ్రీన్. ఇక మామగారు మూవీలో కోటా-బాబు మోహన్ కామెడీ వర్ణించాలంటే మాటలు చాలవు. పనికి మాలిన అల్లుడు గా కోటా, ఆ ఊరి ముష్టోడిగా బాబు మోహన్ సహజ నటనతో చంపేశారు. మామగారు కామెడీ సీన్స్ ఇప్పటికీ ఫేమస్.