
Vijaya Shanthi On Rana Naidu: ఓటీటీ లో అడల్ట్ కంటెంట్ సినిమాలు రావడం కొత్తేమి కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాకుండా కేవలం యూత్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వెబ్ సిరీస్ లను మరియు సినిమాలను తీశారు.వాటికి యూత్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, అంతే కాదు సదరు ఓటీటీ చానెల్స్ కి లాభాల వర్షం కురిపించేలా చేసాయి.అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఏ హీరో కూడా పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నిండి ఉన్న సిరీస్ ని కానీ, సినిమాని కానీ చెయ్యలేదు.

కానీ ఆ సాహసం విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి చేసారు.రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ని చేసారు.నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ పై అందరూ పెదవి విరిచారు.ఎందుకంటే ఇది హద్దులు దాటినా అడల్ట్ కంటెంట్ గా మనం పరిగణించొచ్చు.ఒక సెక్షన్ యూత్ కూడా పెదవి విరిచారు, అలాంటి దారుణమైన బూతులు మరియు అడల్ట్ కంటెంట్ ఈ సిరీస్ లో ఉన్నాయి.

అయితే రీసెంట్ గా సిరీస్ ని చూసిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి మాట్లాడుతూ ‘గత కొంత కాలం గా ఓటీటీ కంటెంట్ సిరీస్ లకు మరియు సినిమాలకు సెన్సార్ ఉండాలని పలువురు ఉద్యమం చేస్తున్నారు.వాళ్ళని పరిగణలోకి తీసుకొని నేను చెప్తున్న మాట ఏమిటంటే నటీనటులు ఇలాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలు,మహిళలు పూర్తిగా వ్యతిరేకించే సినిమాలు చెయ్యడం మానుకోవాలి.ఓటీటీ యాప్స్ కి సంబంధించిన యంత్రాంగం కూడా మహిళలు చేపడుతున్న ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చే ముందే మీరు అప్లోడ్ చేసిన ఆ అడల్ట్ కంటెంట్ సినిమాలను తొలగించాలి’ అంటూ విజయశాంతి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.గతం లో విజయ శాంతి విక్టరీ వెంకటేష్ తో కలిసి చాలా సినిమాలే చేసింది.అందులో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి..కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి,వీళ్ళ మధ్య మంచి రిలేషన్ అయితే ఉంది, కానీ ఈ ఒక్క విషయం లో విజయశాంతి వెంకటేష్ ని తప్పుబట్టింది.