
Keerthy Suresh: న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘దసరా’.నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెలంగాణలోని సింగరేణి ప్రాంతం లోని బాషా యాస తీసుకొని కథ అల్లాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో మరో ‘కాంతారా’ , #RRR అవుతుందని నాని చాలా బలమైన నమ్మకం తో చెప్పాడు.
రీసెంట్ గా విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలను చూస్తూ ఉంటే నాని చెప్పిన మాటలు నిజమే అని అనిపిస్తుంది. ఈ నెల 30 వ తారీఖున ఈ చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. వెన్నెల అనే పాత్ర ద్వారా ఆమె మన ముందుకు రాబోతుంది.’సర్కారు వారి పాట’ సినిమా తర్వాత తెలుగు లో ఆమె చేసిన చిత్రం ఇదే!.

అయితే రీసెంట్ గా ఆమె ఈ మూవీ కోసం పని చేసిన టీం మొత్తానికి గోల్డ్ కాయిన్స్ బహుమతి గా ఇచ్చిందట.130 మందికి 130 గోల్డ్ కాయిన్స్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుంది కీర్తి సురేష్. ఎందుకంటే ఆమె తన పాత్ర మీద ఎంతో సంతృప్తి చెందింది అట.’మహానటి’ తర్వాత అంత నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది ఈ సినిమాతోనే అట.

అందుకు సహకరించినందుకు గాను, ఆమె మూవీ టీం మొత్తానికి సంతోషం తో ఈ గోల్డ్ కాయిన్స్ పంచినట్టు తెలుస్తుంది. గతం లో ఆమె ఇలా ఏ సినిమాకి కూడా చెయ్యలేదు, అలాంటిది ఈ చిత్రం కోసం ఇంత ప్రేమ చూపిస్తుంది అంటే ఆమె పాత్ర ఆ రేంజ్ లో వచ్చింది అన్నమాట.అయితే మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకున్న కీర్తి సురేష్, ఈ సినిమాకి కూడా అందుకోబోతుందో లేదో చూడాలి.