Rishab Shetty: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ‘కాంతారా’ మూవీ ప్రభంజనం ని సువర్ణాక్షరాలతో లిఖించబడినది..ఎందుకంటే అతి చిన్న సినిమా గా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా సినిమా గా అవతరించి సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం ఈమధ్య కాలం లో ఎప్పుడు కూడా చూడలేదు..ఇక కర్ణాటక ప్రాంతం లో అయితే ఈ సినిమా KGF మరియు బాహుబలి ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటడమే కాకుండా కోటి కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన ఏకైక సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక ఈ సినిమాని ప్రేక్షకులు అంతగా ఆదరించడానికి ప్రధాన కారణం క్లైమాక్స్..చివరి 20 నిమిషాలే సినిమాకి ప్రాణం..ప్రేక్షకులందరిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది ఆ చివరి 20 నిమిషాలు..ఈ క్లైమాక్స్ సన్నివేశం చిత్రకరిస్తున్నపుడు ఎన్ని ఇబ్బందులకు గురైయ్యాడో ఆ చిత్ర దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఈ క్లైమాక్స్ ని 360 డిగ్రీస్ తో కెమెరాలను ఉపయోగించి తెరకెక్కించారట..ఇక ఆ సమయం లో భారీ వర్షాలు కూడా పడినట్టు చెప్పుకొచ్చారు..ఆ భారీ వర్షం గ్యాప్ ఇచ్చినప్పుడు షూటింగ్స్ జరుపుకునేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి..అంతే కాకుండా రాత్రి పూట జరిగిన ఈ షూటింగ్ కోసం ప్రతి రోజు మధ్యాహ్నం నుండే రిహార్సల్స్ చేసేవారట..ఇక వారం రోజుల పాటు విరామం లేకుండా షూటింగ్ చెయ్యడం వల్ల నీళ్ల అవసరం బాగా పడిందట..అందుకు గాను సమీపం లో ఉన్న ఒక బావి ని వినియోగించుకోవాల్సి వచ్చిందని.

షూటింగ్ ముగిసేసమయానికి బావి మొత్తం ఖాళి అయిపోయిందని చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి..అలా ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఎక్కడా కూడా రాజి పడకుండా తీసిన ఆ చివరి 20 నిమిషాలకు ప్రేక్షకుల నుండి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని..చాలా సంతోషం గా ఉందని చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి..ఇటీవలే ఈ సినిమా OTT లో విడుదలైన సంగతి తెలిసిందే..OTT లో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరధం పట్టారు.