Ram Charan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..చాలా నెలల నుండి షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం సాంగ్ షూటింగ్ కోసం న్యూజిల్యాండ్ కి వెళ్ళింది..అక్కడ గత కొద్ది రోజుల నుండి రామ్ చరణ్ మరియు కైరా అద్వానీ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు..శంకర్ సినిమాల్లో పాటలు ఎంత రిచ్ గా ఉంటాయో చిన్నప్పటి నుండి ఆయన పాటలు చూస్తూ పెరిగిన మనకి బాగా తెలుసు.

ఈ సినిమా లో కూడా పాటల చిత్రీకరణ చాలా రిచ్ గా శంకర్ మార్కు కనపడేలా ఉంటుంది అట..ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సాంగ్ కి కూడా భారీ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం..అయితే ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లో హీరోయిన్ కైరా అద్వానీ రామ్ చరణ్ కలిసి పోటీ పడుతూ బర్గర్ తింటున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా..అది ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.
ఇది ఇలా ఉండగా రాంచరణ్ మరియు కైరా అద్వానీ ఈ సినిమాకి ముందు ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం లో నటించారు..ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ – కైరా అద్వానీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది..చాలా క్లోజ్ గా వీళ్ళిద్దరూ మూవ్ అయ్యేవారు..వీళ్ళిద్దరూ క్లోజ్ గా నడుచుకోవడం పై అప్పట్లో ఉపాసన తీవ్రమైన అభ్యంతరం వ్యక్తపరిచిందట..రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య అప్పట్లో ఈ విషయం పై బాగా గొడవలు కూడా జరిగేవట..ఒకానొక సందర్భం లో రామ్ చరణ్ కైరా అద్వానీ తో డేటింగ్ లో ఉన్నాడు..ఉపాసనకు విడాకులు ఇబ్బబోతున్నాడు అనే రేంజ్ వార్తలు కూడా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి..అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది.

ఎందుకంటే కైరా అద్వానీ బాలీవుడ్ టాప్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో ఎప్పటి నుండో డేటింగ్ లో ఉంది..వచ్చేనెలలో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు..ఉపాసన కి కైరా – సిద్దార్థ్ మల్హోత్రా డేటింగ్ లో ఉన్నారని తెలిసినప్పటి నుండి రామ్ చరణ్ కైరా తో ఎంత క్లోజ్ గా ఉన్నా పట్టించుకోవడం మానేసి స్పోర్టివ్ గా తీసుకోవడం ప్రారంభించింది..నిన్న కైరా అద్వానీ రామ్ చరణ్ తో కలిసి బర్గర్ తింటున్న ఫోటో పెట్టగా దాని క్రింద కామెంట్స్ లో కూడా ఉపాసన చాలా స్పోర్టివ్ గా కామెంట్ పెట్టింది..’చాలా బాగున్నారు మీరిద్దరూ..మిమల్ని మిస్ అవుతున్నాను’ అంటూ ఉపాసన పెట్టిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


