Uttar Pradesh Wife And Husband: మనుషుల్లో సహనం నశిస్తోంది. చిన్న విషయాలకే పెద్దగా ఆలోచిస్తున్నారు. చిన్న పనులకే పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. దీనికి ఉత్తర ప్రదేశ్ వేదికగా మారుతోంది. నేరాల సంఖ్య అక్కడ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. నేరాలు చేసే వారు పెరుగుతున్నారు. కట్టుకున్న ఆలినే వేధింపులకు గురి చేస్తున్నారు. ఫలితంగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దురుద్దేశంతో ఆలినే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ఇల్లాలిపైనే దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఆమె ఎవరిని కలవాలి? ఏమని ఫిర్యాదు చేయాలి? భార్యలను భర్తలు పెట్టే చిత్రహింసలకు పరాకాష్టగా మారుతోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని ఫిలీబిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్ అనే యువకుడికి సీమాదేవితో ఏడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వీరి కాపురం సజావుగానే సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సీమాదేవి జహీరుద్దీన్ కు పెట్టిన భోజనంలో వెంట్రుక వచ్చింది. దీంతో వెంట్రుక ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు. ఏదో తెలియకుండా వచ్చిందని సమాధానం చెప్పినా వినలేదు. ఆమెపై అక్కసు పెంచుకున్నాడు. సీమాదేవికి గుండు గీయించాడు. దీనికి వెంట్రుక వచ్చిందనే కారణం చూపినా అది అసలు కారణం కాదని చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా సీమాదేవిని అదనపు కట్నం తేవాలని ఇబ్బంది పెడుతున్నాడు. తనకు రూ.15 లక్షలు తీసుకురావాలని కొద్ది కాలంగా వేధిస్తున్నాడు. ఇదే సందర్భంగా భావించుకుని గుండు చేయించాడు. తన కోపాన్ని ఇలా చూపించాడు. ఆమెకు గుండు గీయించి అవమానించాడు. స్థానికుల సహాయంతో బాధితురాలు సీమాదేవి పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అవమానానికి జహీరుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నా అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు.

అదనపు కట్నం కోసమే సీమాదేవికి గుండు గీయించాడని అర్థమవుతోంది. కట్నం కోసం ఇలాంటి వేధింపులు చేయడం గమనార్హం. కట్నం కావాలని డిమాండ్ చేసినా అతడి కోరిక తీరకపోవడంతో ఎలాగైనా ఆమెను కష్టాల పాలు చేయాలని భావించాడు. వెంట్రుక కారణాన్ని సాకుగా చూపి గుండు చేయించడం ఆందోళనలకు తావిస్తోంది. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జహీరుద్దీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.