Pawan Kalyan- Trivikram: ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెల్సిందే..ఈ చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్ – మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే టైటిల్ ని ఖరారు చేసారు..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ తేరి చిత్రం లైన్ ని తీసుకొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు హరీష్ శంకర్..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అంతే కాకుండా సంతోషం , మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దశరధ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..ఫిబ్రవరి నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..ఇక నిన్న జరిగిన పూజా కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ సన్నిహితులందరూ హాజరయ్యారు,ఒక్క త్రివిక్రమ్ తప్ప..అందువల్ల సోషల్ మీడియా లో దీనిపై ఒక చర్చ జోరుగా సాగుతుంది.
గాసిప్స్ కి సోషల్ మీడియా ఈమధ్య కాలం లో అడ్డాగా మారిపోయింది..ఎదో ఒక పని కారణం గా ఆప్త మిత్రులు కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోవచ్చు..నిన్న త్రివిక్రమ్ పూజా కార్యక్రమానికి రాకపొయ్యేసరికి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మధ్య గొడవలు జరిగాయని..భీమ్లా నాయక్ సినిమా పూర్తయిన తర్వాత వీళ్లిద్దరి మధ్య మాటలు లేవని..అందుకే వినోదయ్యా సీతం రీమేక్ కూడా ఆగిపోయిందని ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి.

కానీ అసలు విషయం ఏమిటంటే నిన్న పూజా కార్యక్రమానికి త్రివిక్రమ్ రాకపోవడానికి ఒక కారణం ఉంది..ఆయన గత వారం రోజుల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తో దుబాయ్ లోని ఒక హోటల్ లో ఉంటున్నాడు..త్వరలో మహేష్ తో తియ్యబోయ్యే సినిమా గురించి ఆయన స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నాడు..అతనితో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఉన్నాడు..అందుబాటులో లేదు కాబట్టే త్రివిక్రమ్ నిన్న పూజా కార్యక్రమానికి రాలేదని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి..సోషల్ మీడియా లో జరుగుతున్న విషప్రచారాలని నమ్మొద్దని..పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులని ఈ సందర్భంగా తెలిపారు.