Wrong UPI Transfer: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆన్ లైన్ విధానానికి మారుతున్నాయి. ఇందులో భాగంగా పేమెంట్లు సైతం డిజిటల్ రూపంలోకి వచ్చాయి. ఆన్ లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ ఉన్న చోటు నుంచి క్షణాల్లో నగదును బదిలీ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు.
గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యాప్ ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న చిన్న అవసరాల నుంచి రూ. లక్ష లోపు వరకు పేమెట్స్ ను చేయగలుగుతున్నారు. అయితే ఒక్కొసారి మాత్రం డబ్బును పొరపాటుగా ఇంకొకరికి పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్ స్కాన్ వంటి వాటిని ఉపయోగించి డబ్బును ఈజీగానే ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. కానీ ఫోన్ నంబర్ ద్వారా చేసే పేమెంట్లు ఒక్కోసారి వేరే వారికి వెళ్లిపోతాయి.. ఆ విధంగా పేమెంట్ చేస్తే ఎలా వెనక్కి తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదనే చెప్పుకోవచ్చు.
అయితే ఈ విధంగా వేరే వారికి డబ్బు పంపితే ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు సంస్థలు బాధ్యత వహించవన్న సంగతి తెలిసిందే. అయినా వారికి ముందుగా ఫిర్యాదు చేయాలి.. అయితే ఈవిధంగా డబ్బు వేరే వాళ్లకి బదిలీ అయిపోయింది. తిరిగి ఎలా పొందడం అని ఆందోళన పడ్సాలిన పని లేదు.. అదేలా అనుకుంటున్నారా?
సాధారణంగా మనం అనుకోకుండా డబ్బు పంపిన వ్యక్తి అకౌంట్ కూడా మన బ్యాంక్ లోనే ఉంటే గనుక ఐదు, ఆరు రోజుల్లో రీఫండ్ అవుతుంది. అలా కాకుండా వేరే అకౌంట్ దారులు అయితే మాత్రం వారం నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతుందంట.
ముందుగా డబ్బులు పంపిన తరువాత వచ్చే మేసేజ్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తరువాత సదరు పేమెంట్ యాప్ లో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసి మన సమస్యను తెలపాలి. అలాగే ఎన్పీసీఐ పోర్టలో కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇందుకోసం npci.org.in వెబ్ సైట్ లోకి వెళ్లి What we Do టాబ్ లో యూపీఐపై క్లిక్ చేసి ఫిర్యాదు సెక్షన్ లో కంప్లైంట్ నమోదు చేయాలి. ఈ తరహాలో సమస్య పరిష్కారం కాని పక్షంలో Bankingombudsman.rbi.org.in లో ఫిర్యాదు చేయవచ్చని తెలుస్తోంది.
అలాగే మీరు డబ్బు పంపిన వ్యక్తి ఆ నగదును తిరిగి పంపేందుకు నిరాకరించినట్లయితే చట్టబద్ధంగా కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది.