Site icon OkTelugu

Salaar Collections: సలార్ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… ప్రభాస్ ర్యాంపేజ్!

Salaar Collections

Salaar Collections

Salaar Collections: ప్రభాస్ ఫైనల్లీ హిట్ కొట్టాడు. సలార్ మూవీ వరల్డ్ వైడ్ వసూళ్లు కుమ్మేస్తుంది. సలార్ మూడు రోజుల వసూళ్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ విడుదల చేశారు. సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. ఫస్ట్ డే సలార్ రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2023కి గానూ హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ గా నిలిచింది. లియో రికార్డు బ్రేక్ చేసిన మొదటి స్థానంలో నిలిచింది.

రెండో రోజుకు సలార్ వసూళ్లు తగ్గాయి. అయితే మూడో రోజు పుంజుకుంది. ఆదివారం మంచి వసూళ్లు రాబట్టింది. సలార్ మూవీ వరల్డ్ వైడ్ మూడు రోజులకు రూ. 402 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. సలార్ వసూళ్లపై నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సలార్ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా దూరంలో ఉంది.

నేడు క్రిస్మస్ కాగా సెలవు దినం. సలార్ చిత్రానికి కలిసొచ్చే అంశం. న్యూ ఇయర్ వరకు జనాలు పండగ మూడ్ లో ఉంటారు. సలార్ వసూళ్లు నిలకడగా ఉంటే… బ్రేక్ ఈవెన్ అంత కష్టం కాదు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో సలార్ వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. సలార్ ఫైనల్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూడాలి.

సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. కెజిఎఫ్ దర్శకుడితో ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ మరింత పెరిగింది. అభిమానుల నమ్మకం నిలబెడుతూ సలార్ మూవీలో ప్రభాస్ మాస్ అప్పీరెన్స్ మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ కట్ అవుట్ కి సరిపోయే కథతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను పలకరించారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక రోల్స్ చేశారు.

Exit mobile version