Bandana Girl: నేటి ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియా చుట్టూ పరిభ్రమిస్తోంది. సోషల్ మీడియా ఆధారంగానే లక్షల కోట్ల వ్యాపారం సాగుతోంది. సోషల్ మీడియా యాప్స్ లోనే అమ్మకాల నుంచి మొదలుపెడితే కొనుగోళ్ల వరకు సాగుతున్నాయి.. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అంతేకాదు సామాన్యులు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు.
సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.. ఎవరు సెలబ్రెటీలు అవుతారు.. ఎవరు ఓవర్ నైట్ స్టార్ అవుతారు.. అంచనా వేయలేకపోతున్నారు.. ఇటీవల కుంభమేళా జరిగినప్పుడు పూసలు అమ్ముకునే మోనాలిసా ను సోషల్ మీడియా స్టార్ ను చేసింది. దీంతో ఆమె సినిమా నటి అయిపోయింది. ఇటీవల ఆమె నటిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం అయింది.. మనదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలామంది ఇలానే సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు అయ్యారు.
ఇప్పుడు మనం చర్చించుకునే కథనంలో ఓ యువతి 2 సెకండ్ల వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది.. తన దినచర్యలో భాగంగా ఆమె ఆటోలో వెళుతుండగా తన ఫోన్ ద్వారా వీడియో తీసుకుంది.. నవంబర్ 2న ఈ వీడియోను (bud wiser @ wOrdgenerator) పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె వైట్ టాప్ ధరించింది. చెవులకు వెండి పోగులతో కనిపిస్తోంది. ఆటోలో ప్రయాణిస్తూ ఆమె ఈ వీడియో తీసుకుంది. అంతే కాదు ఆ వీడియో పోస్ట్ చేస్తూ.. ఈరోజు మేకప్ బాగా కుదిరింది (makeup ate today) అంటూ ఆ వీడియోకు ఆమె క్యాప్షన్ జత చేసింది. రెండు సెకండ్ల ఈ వీడియో ఇప్పటికే 10 కోట్ల వ్యూస్ సంపాదించుకుంది.. 6000 మంది ఈ వీడియోకు తమ స్పందన వ్యక్తం చేశారు.. 26,000 మంది రీ పోస్ట్ చేశారు. 1.25 లక్షల లైక్ లతో ఈ వీడియో దూసుకుపోతోంది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన అమ్మాయి సెలబ్రిటీ కాదు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా అంతంత మాత్రమే. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి సెలబ్రిటీ అయిపోయింది. ఆమె గురించి కొంతమంది ఆరా తీయగా పేరు ప్రియాంగ అని తెలిసింది. మీడియా సంస్థలు ఆమెతో కోలాబరేట్ అవ్వడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఇంతగా వైరల్ కావడంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మహా అయితే ఈ వీడియోకు వెయ్యి లైకులు వస్తాయని భావించిందట. కానీ ఆమె ఊహించిన విధంగా ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ వీడియో ఈ స్థాయిలో సంచలనం సృష్టించడంతో ఆ యువతి తన ముఖాన్ని పదేపదే చూసుకుంటున్నదట. ఈ అమ్మాయి వీడియో సంచలనం సృష్టించడంతో.. ట్విట్టర్ సంస్థ ఆమెకు వెరిఫైడ్ అకౌంట్ మంజూరు చేసింది. అంతేకాదు బ్లూటిక్ కూడా ఇచ్చేసింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. ” ఈ అమ్మాయి వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. వెరిఫైడ్ అకౌంట్ కూడా ఓకే అయింది. ఇకపై ఆమెకు డాలర్ల మీద డాలర్లు వస్తాయి. రూపాయి బలం పుంజుకుంటుంది. డాలర్ ను ఢీ కొడుతుందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.