Homeఎంటర్టైన్మెంట్Manchu Manoj- Mounika Marriage: వీడియో: మనోజ్-మౌనికల పెళ్లి ఇంత వైభవంగా జరిగిందా... కోట్లు ఖర్చు...

Manchu Manoj- Mounika Marriage: వీడియో: మనోజ్-మౌనికల పెళ్లి ఇంత వైభవంగా జరిగిందా… కోట్లు ఖర్చు చేసినట్లు ఉన్నారుగా!

Manchu Manoj- Mounika Marriage
Manchu Manoj- Mounika Marriage

Manchu Manoj- Mounika Marriage: మంచు మనోజ్ మొదటి వివాహానికి ఏమాత్రం తగ్గకుండా రెండో వివాహం చేసుకున్నట్లు తాజా వీడియోతో బయటపడింది. అక్క మంచు లక్ష్మి నివాసంలో నిరాడంబరంగా జరిగిందని అందరూ భావిస్తుంటే, కాదని తేలింది. కుటుంబ కలహాల మధ్య మనోజ్ ఇంత వైభవంగా వివాహం చేసుకోవడం కొస మెరుపు. అది మౌనిక మీద ఆయనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. మనోజ్-మౌనికల వివాహానికి మోహన్ బాబు, విష్ణు దూరంగా ఉన్నారు. మూడు రోజులు వివాహ వేడుకలు జరిగాయి. చివరి రోజు మాత్రమే మోహన్ బాబు హాజరయ్యారు.

మనోజ్ పెళ్ళికి పరిశ్రమ నుండి అతికొద్ది ప్రముఖులు మాత్రమే వచ్చారు. బహుశా ఆయన కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలిచి ఉండవచ్చు. మనోజ్ రెండో వివాహం తన స్థాయికి తగ్గట్లు చేసుకోలేదని, అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా ఏదో పర్లేదు అన్నట్లు లాగించేసిందని అందరూ భావించారు. తాజా వీడియోతో ఆ అభిప్రాయం పటాపంచలు అయ్యింది.

మనోజ్ తన వివాహం ఎంత ఘనంగా జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దీనికి ఓ సాంగ్ ప్రత్యేకంగా కంపోజ్ చేయించారు. ‘ఏం మనసో’ అనే మనోజ్ పెళ్లి పాటను అనంత శ్రీరామ్ పాడారు. అచ్చు సంగీతం అందించారు. సినిమాటిక్ స్టైల్ లో గ్రాండ్ గా రూపొందించి వదిలారు. మూడు రోజుల వివాహం ఏమాత్రం తగ్గకుండా అన్ని వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిందని స్పష్టత వచ్చింది.

Manchu Manoj- Mounika Marriage
Manchu Manoj- Mounika Marriage

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ వీడియో హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల అలా మొదలైంది అనే టాక్ షోలో మనోజ్-మౌనిక పాల్గొన్నారు. పేరెంట్స్ దూరమైన నాకు మనోజ్ అండగా నిలిచాడని మౌనిక అన్నారు. మనల్ని నమ్మిన ఒక అమ్మాయి కోసం నిలబడకపోతే బ్రతికి కూడా అనవసరం అనిపించిందని మనోజ్ కామెంట్ చేశారు. ఒక పెళ్ళికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని. ఇద్దరు కలుసుకోకుండా దారులు మూసేసే ప్రయత్నాలు జరిగాయని మనోజ్ చెప్పుకొచ్చారు.

Yem Manaso Video Song | Manchu Manoj, Bhuma Mounika | Achu Rajamani | Ananth Sriram

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version