
RCB vs CSK Viewership Record: ఐపీఎల్ సీజన్ 16 మొదలైన రోజు నుంచి అన్ని మ్యాచ్‌లో హోరాహోరీగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి.: ఐపీఎల్ సీజన్ 16 మొదలైన రోజు నుంచి అన్ని మ్యాచ్‌లో హోరాహోరీగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఇక అన్ని జట్టు భారీ స్కోర్ సాధిస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు అన్ని మ్యాచ్‌లలో ఏదో ఒక రికార్డు నమోదవుతోంది. తాజాగా మంగళవారం జరిగిన చెన్నై–బెంగుళూరు మ్యాచ్ కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆఖరి రెండు బంతుల వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి చెన్నైనే విజయం వరించింది. ఈ మ్యాచ్‌ను జియో సినిమా యాప్‌లో మొత్తం 2.40 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యూయర్ షిప్.
చివరి వరకూ ఉత్కంఠ..
చెన్నై–బెంగళూరు మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం అయిన దశలో యంగ్ బౌలర్ పతిరణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బెంగుళూరు ను కట్టడి చేశాడు. దీనితో చెన్నై ఎనిమిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
వ్యూవర్‌షిప్ రికార్డులు ఇవీ..
గతంలో చెన్నై రాజస్థాన్ మ్యాచ్‌ను 2.20 కోట్ల మంది చూశారు. ఆ తర్వాత బెంగుళూరు లక్నో మ్యాచ్‌ను 1 .8 కోట్ల మంది , హైదరాబాద్ – కోల్‌కతా మ్యాచ్, ముంబై–ఢిల్లీ మ్యాచ్, చెన్నై–లక్నో మ్యాచ్‌లను 1.7 కోట్ల మంది వీక్షించారు
చెన్నై మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి..
ఐపీఎల్‌లో జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్లు, చెన్నై టీం ప్రదర్శనను చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. చెపాక్ స్టేడియంలో రాజస్థాన్–చెన్నై మధ్యజరిగిన ఐపీఎల్ సీజన్16 తొలి మ్యాచ్‌ను కూడా 2 కోట్ల మంది వీక్షించారు. ధోని విధ్వంసాలకు జియో సినిమా వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో కోటి, కోటిన్నర వ్యూస్ ఉండగా ఆఖర్లో ధోని బ్యాటింగ్‌కు వచ్చి బాదుడు మొదలెట్టాక వ్యూయర్‌షిప్ ఏకంగా 2 కోట్లు దాటింది. మొత్తంగా చెన్నై టీం ఆడితే చాలు అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా చెన్నైతో మ్యాచ్ అయితే చాలు అన్నట్లుగా ఐపీఎల్ సీజన్ 16 మ్యాచ్‌లు సాగుతున్నట్లు అర్థమవుతోంది. రాను రాను వ్యూవర్‌షిప్ రికార్డులు బద్దలు కావడం ఖాయం.

2019 నుంచి రికార్డుల మోతే..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు హయ్యస్ట్ వ్యూస్‌కు సంబంధించిన రికార్డు 2019 సీజన్‌లో నమోదైంది. ఈ సీజన్‌లో భాగంగా ముంబై – చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో రియల్ టైమ్ వ్యూస్ 1.8 కోట్లకు తాకింది. అప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు హాట్ స్టార్ లో ప్రసారమయ్యాయి. కానీ ఈ రికార్డును జియో చెల్లాచెదురు చేస్తోంది. ఈ సీజన్ లో శని, ఆదివారాలతోపాటు మిగతా రోజుల్లో కూడా మ్యాచ్‌లలో రియల్ టైమ్ వ్యూస్ ఏకంగా కోటి దాటుతోంది. హాట్ స్టార్‌లో మ్యాచ్ లు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. కానీ జియోలో ఐపీఎల్ ఉచితంగా ప్రసారమవుతుంది. దీంతో వ్యూవర్‌షిప్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
జియో సినిమాలో ఐపీఎల్ – 2023 హయ్యస్ట్ వ్యూస్ రికార్డు..
సీఎస్‌కే–రాజస్థాన్ : 2.2 కోట్లు
ఆర్సీబీ– లక్నో : 1.8 కోట్లు
ముంబై – ఢిల్లీ : 1.7 కోట్లు (లాస్ట్ ఓవర్ థ్రిల్లర్)
సీఎస్‌కే – లక్నో : 1.7 కోట్లు (ఇది కూడా ధోని.. మార్క్ వుడ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టినప్పుడే)
సీఎస్‌కే – గుజరాత్ : 1.6 కోట్లు