Meenakshi Seshadri
Meenakshi Seshadri: 17 ఏళ్లకే మిస్ ఇండియా టైటిల్.. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీ.. కూచిపూడి, భరతనాట్యం, కథక్ లాంటి నృత్యాల నేర్పరి అయిన ఆ ముద్దుగుమ్మ 1990 దశకంలో స్టార్ హీరోయిన్. ఆమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు కొందరు డైరెక్టర్లు క్యూ కట్టేవారు. కొన్నాళ్ల పాటు తన హవా సాగించిన ఈమె పెళ్లి తరువాత సినిమాలు మానేసింది. ఇప్పుడు అమెరికాలో ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన ఓ చిన్నప్పటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరనే ప్రశ్న మీకు తప్పకుండా వస్తుంది. మరి వెంటనే ఆ హీరోయిన్ గురించి తెలుసుకోండి.
అప్పటి వరకు మెగాస్టార్ మాస్ హీరో అని అనిపించుకున్నాడు. కానీ 1992లో తాను సోలో హీరో పాత్రలు కూడా చేస్తానని నిరూపించాడు. కళాతపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’ ఆ సమయంలో బ్లాక్ బస్టర్. ఇందులో చిరంజీవితో పాటు మీనాక్షి శేషాద్రి కలిసి నటించారు. మీనాక్షి శేషాద్రి అంతకుముందే 1991లో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో రంగప్రవేశం చేశారు. కానీ ‘ఆపద్భాంధవుడు’తో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన మీనాక్షి ఆ తరువాత తమిళం, హిందీ సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో మీనాక్షి గాయకుడు కుమార్ సానుతో లవ్ లో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ 1995లో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్ ను న్యూయార్క్ లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె విదేశాల్లో ఉన్న భారతీయ నృత్యాలను అందరికీ పరిచయం చేస్తోంది. కళలపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి భరతనాట్యం, కూచిపూడిలను నేర్పిస్తుంది. కాలిఫోర్నియాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియాన్ ఆరిజన్ కన్వెన్షన్ తో సహా, తాను నృత్యం చెప్పే విద్యార్థులతో కలిసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది.
Meenakshi Seshadri
మీనాక్సి శేషాద్రికి సంబంధించిన చైల్డ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఆమె సినిమాల్లో నటించినంత కాలం ఎవర్ గ్రీన్ బ్యూటీ అని పేర్కొన్నారు. ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలోనూ మీనాక్షి ఉన్నారు. అయిత పెళ్లి తరువాత సినిమాలను మానిసి ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయింది. ఆమె లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఆమెను చూసి అంతా షాక్ అవుతున్నారు.