Meenakshi Seshadri: ఇప్పటికీ కూడా చిరంజీవి విభిన్నమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి యంగ్ బ్యూటీల వరకు చిరంజీవి సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు కెరియర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ సినిమాలలో ఆపద్బాంధవుడు సూపర్ హిట్ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. 1992లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి శేషాద్రి నటించింది. ఆపద్బాంధవుడు సినిమాతో మీనాక్షికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగులో ఈ సినిమా తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె ఆ సమయంలో బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
మీనాక్షి శేషాద్రి హిందీలో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆమెకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు అని తెలుస్తుంది. చేసిన ఒక్క సినిమా ఆపద్బాంధవుడు తోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. 1980-90 లో భారీ పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో మీనాక్షి శేషాద్రి కూడా ఒకరు. హిందీలో ఈమె అమితాబచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. హిందీలో మీనాక్షి అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమా ఆఫర్లు బాగా వస్తున్న సమయంలో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మీనాక్షి శేషాద్రి. 1995లో మీనాక్షి శేషాద్రి, హరీష్ పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారు. మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. ఈమె భరతనాట్యంలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మీనాక్షి శేషాద్రి అమెరికాలో భరతనాట్యం, కథక్, ఒడిసి నృత్యాలు నేర్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం మీనాక్షి శేషాద్రి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆపద్బాంధవుడు హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. 60 ఏళ్ల వయసులో కూడా మీనాక్షి శేషాద్రి అదే అందంతో అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
View this post on Instagram