
Keerthy Suresh- Nani: దసరా మూవీ హీరో నాని హీరోయిన్ కీర్తి సురేష్ మీద మనసుపడ్డాడట. ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడట. ఇవన్నీ తెలిసి కూడా కీర్తి సురేష్ ఏమీ తెలియనట్లు ఉన్నారట. ఈ మేరకు ఓ ట్వీట్ ప్రకంపనలు రేపుతుంది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ అయిన ఉమర్ సంధు చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉమర్ సంధు దసరా చిత్రానికి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఆయన చెప్పినట్లే మూవీ సూపర్ హిట్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా వసూళ్లు భారీగా ఉన్నాయి. నాని కెరీర్ బెస్ట్ నమోదు చేశారు.
అయితే హీరోయిన్ కీర్తి సురేష్ తో నానికి ఎఫైర్ అంటగట్టి ఆయన మరోసారి వార్తలకు ఎక్కారు. పెళ్లైన నాని మనసు గతి తప్పిందట. దసరా మూవీలో ఆయనకు జంటగా నటించిన కీర్తి సురేష్ పట్ల ఆకర్షితుడు అయ్యాడట. ఆమెకు దగ్గరవ్వాలని చూశాడట. కీర్తి సురేష్ మాత్రం ఇవ్వన్నీ గమనిస్తూ గమ్మున ఉండిపోయిందట. నానిది వన్ సైడ్ లవ్ అట. ఇక కీర్తి సురేష్ నుండి ఎలాంటి స్పందన రాలేదట. నాని చర్యలు ఆమెకు అర్థమయ్యాయట. అయినా ఏమీ తెలియనట్లు ఆయనతో స్నేహంగా మెలిగారట.
ఉమర్ సంధు ట్వీట్ సారాంశం ఇదే. తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అందిందని ఉమర్ సంధు బల్లగుద్ది చెప్పారు. ఇక ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి. ఈ మధ్య తరచుగా ఉమర్ సంధు ఇదే తరహా ట్వీట్స్ వేస్తున్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎవరినీ వదలకుండా ఎఫైర్స్ అంటగడుతున్నాడు. ఖుషి చిత్ర సెట్స్ లో సమంత-విజయ్ దేవరకొండ దగ్గరయ్యారని ఒక ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస్-కృతి సనన్ లను ఉద్దేశిస్తూ పలు వివాదాస్పద కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో సెన్సేషన్ చేసి వార్తల్లో నిలిచేందుకు ఉమర్ సంధు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నాడనే ప్రచారం ఉంది.

ఈ పుకార్లు పక్కన పెడితే నాని-కీర్తి సురేష్ దసరా మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్లకు దగ్గరైంది. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్లో దసరా వసూళ్లు బాగున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఎట్టకేలకు నాని ఓ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు.
Extra Marital Affair Alert 🚨! As per Close insider, #Nani fell in Love with #KeerthySuresh during Shoot of #Dasara. He has One sided Love for her !!! Keerthy knows about all but she didn’t respond him yet. pic.twitter.com/fCxbrQF7T8
— Umair Sandhu (@UmairSandu) April 3, 2023