
Harish Shankar: టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకడు హరీష్ శంకర్.రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈయన రవితేజ ‘షాక్’ సినిమాతో ఇండస్ట్రీ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యినప్పటికీ రెండవ సినిమా ‘మిరపకాయ్’ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు రవితేజ.ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసింది.ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన అవేమి ఆశించిన స్థాయిలో ఆడలేదు.ఇప్పుడు మళ్ళీ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చెయ్యబోతున్నాడు.గత ఏడాది పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు మూడేళ్ళ క్రితమే అధికారికంగా ప్రకటించారు.కానీ కథ లో దమ్ము లేకపోవడం తో ఈ సినిమాని పక్కన పెట్టి తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి’ చిత్రం కాన్సెప్ట్ ని తీసుకొని సొంతంగా ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ కి వినిపించాడు హరీష్ శంకర్.
ఆయనకీ ఎంతగానో నచ్చింది,వెంటనే ఆ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టి ప్రాతంభించేసారు కానీ, ఇంతలోపే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వడం హరీష్ శంకర్ కి తీవ్రమైన అసహనానికి గురయ్యేలా చేసింది.ఈ రీమేక్ సబ్జక్ట్స్ అన్ని పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయిస్తున్నాడు.వకీల్ సాబ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది, కానీ మధ్యలో భీమ్లా నాయక్ సినిమాని తీసుకొచ్చాడు హరీష్ శంకర్.

ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీ అయినా పవన్ కళ్యాణ్ హరీష్ ప్రాక్ట్ ని తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టాడు.ఆ తర్వాత వెంటనే మరో సినిమా ప్రారంభించడం తో తనతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయ్యోమయ్యం పరిస్థితి ఏర్పడింది.మూడేళ్ళ నుండి హరీష్ శంకర్ కి ఎలాంటి ఇన్కమ్ లేదు.ఇలా జరగడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ హరీష్ తన సన్నిహితులతో చెప్పుకుంటూ వాపోయినట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.