
Ustad Bhagat Singh: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే గతం లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది కాబట్టి.
సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భుక్తాయాసం వచ్చేలా చేసింది ఈ సినిమా.అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్నా సినిమా కాబట్టే ఈ చిత్రం పై ఫ్యాన్స్ అంతలా ఆశలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా స్టోరీ తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ నుండి అడాప్ట్ చేసుకున్నారు అనే రూమర్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది.
అయితే అది నిజమేనని, కానీ రీమేక్ మాత్రం కాదు ,కేవలం ఆ ఐడియా ని తీసుకొని సొంతంగా డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది అంటూ ఈ చిత్రానికి కథని డెవలప్ చేసిన టీం లో ఒకరైన సీనియర్ దర్శకుడు దశరథ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపిక అయ్యిందట.

హరీష్ శంకర్ ఎప్పుడు డేట్స్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే పూజా హెగ్డే, భవదీయుడు భగత్ సింగ్ కోసం డేట్స్ అడగగానే కళ్ళు మూసుకొని ఇచ్చేసిందట.మరి ఆన్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
