
Ramcharan : ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఘన స్వాగతం లభించింది. అమెరికాలో చిరంజీవి వీరాభిమానులు చరణ్ కు అరుదైన అద్భుత రీతిలో స్వాగతించారు.

అమెరికాలో మెగాకుటుంబం పేరున ఎనలేని సేవలు చేస్తున్న గొలగాని రవి కృష్ణ స్వయంగా రామ్ చరణ్ ను కారువద్దకు వచ్చి మరీ తోడ్కొని వెళ్లారు..

అనంతరం న్యూయార్క్ లోని ఏబీసీ స్టూడియో వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గ్రాండ్ గా వెల్ కం పలికారు రవి కృష్ణ .

గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమెరికాలోని మెగా ఫ్యాన్స్ తో కలిసి విజయవంతం చేసిన రవి కృష్ణ గారికి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడుతోపాటు మెగా ఫ్యాన్స్ అంతా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు