Valentine’s Day 2024: ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. మిగతా అన్ని రోజులు ఒకెత్తయితే.. ప్రేమికుల దినోత్సవం వారికి ఒకెత్తు. అందుకే ఫిబ్రవరి 14ను ఘనంగా జరుపుకుంటారు. వారిదైన లోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఆత్మీయంగా సంభాషించాలని అనుకుంటారు. ఇలా ప్రేమికుల రాకతో కొన్ని ప్రాంతాలు లవ్ వంతెనలు గా మారిపోయాయి.. అంతేకాదు బంధాన్ని లాక్ చేసే తాళం చెవులుగా రూపాంతరం చెందాయి. ఈ ప్రేమికుల దినోత్సవ సందర్భంగా వాటి గురించి తెలుసుకుందామా?
పాంట్ డెస్ ఆర్ట్స్, పారిస్, ఫ్రాన్స్
ప్రపంచంలోని ప్రేమికులు తమ విహారయాత్రకు మొదట ఎంచుకునే ప్రాంతం మీదే.. ఇది దశాబ్దాల నుంచే ప్రేమికులకు అత్యంత దర్శనీయ ప్రాంతంగా పేరు పొందింది. ఇక్కడ ప్రేమికులు సీన్ నదిపై నిర్మించిన పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జి కు అటూ ఇటూ ఏర్పాటుచేసిన ఇనుప రెయిలింగ్ కు ఇత్తడి తాళాలు వేస్తారు. జంటగా వచ్చి కబుర్లు చెప్పుకొని.. తమ బంధం ఏనాడూ విడిపోకూడదని ప్రతిజ్ఞ చేస్తూ..ఒకరు తాళం పట్టుకుని.. మరొకరు తాళం చెవితో దాన్ని లాక్ చేస్తారు. ఇలా చేస్తే తమ బంధం ఎప్పటికీ గట్టిపడి ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఈ తాళం వేసే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందనే దానికి ఆధారాలు లేవు. ప్రేమికులు అటు ఇటు తాళాలు వేయడంతో ఇనుప రెయిలింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.
సెర్బియా వంతెన
సెర్బియా లో నాడా, రెల్జా అన్న యువతీ యువకులు ప్రేమించుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో రెల్జా దుర్మరణం చెందుతాడు. అప్పటినుంచి నాడా తీవ్ర విచారంలో మునిగిపోతుంది. ఆ మనోవేదనతోనే చనిపోతుంది. అప్పటినుంచి సెర్బియా లోని మోస్ట్ ల్జు బావి ప్రాంతంలో నిర్మించిన వంతెనకు ప్రేమికులు అటు ఇటు తాళాలు వేసే సంప్రదాయాన్ని ప్రారంభించారు. స్వర్గంలో ఉన్న నాడా, రెల్జా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు. వారు వేసిన తాళాలపై తమ పేర్లు చెక్కుతారు. ఈ ప్రాంతం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
స్కిన్ని బ్రిడ్జ్, అమ్ స్ట ర్ డ్యాం
ఎన్ని స్కిన్ని బ్రిడ్జి లేదా కిస్సింగ్ బ్రిడ్జి అని పిలుస్తారు. ఇది రాత్రిపూట 1200 విద్యుత్ దీపాల వెలుగులో ప్రకాశిస్తుంది. దీని మీదుగా ప్రయాణించే ప్రేమికులు గాడ చుంబనం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. చుంబనం పూర్తయిన తర్వాత తమ ప్రేమకు గుర్తుగా తాళాలు వేస్తుంటారు. ప్రేమికుల రాకతో అత్యంత ప్రజలను పొందిన వంతెనగా ఇది నిలుస్తోంది
మకార్డ్ స్టెగ్ వంతెన, ఆస్ట్రియా
ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ లోని మకార్డ్ స్టెగ్ వంతెన .. ఇది లవర్స్ బ్రిడ్జిగా పేరుపొందింది. దీనిని 2001లో నిర్మించారు. ఆస్ట్రియా కారుడు హన్స్ మకార్డ్ పేరును ఈ వంతెనకు పెట్టారు. ఈ వంతెన ఎక్కితే సాల్జ్ బర్గ్ కేతడ్రల్, హిల్ సైడ్ హోసెన్ సాల్జ్ బర్గ్ కోట దృశ్యాలను చూపిస్తుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తాళాలు వేస్తారు. తమ ప్రేమను బలోపేతం బలోపేతం చేసుకుంటారు.
నాపా వ్యాలీ వైన్ ట్రైన్, లవ్ లాక్ బ్రిడ్జి
నాపా.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్థలాల్లో ఒకటి గా నిలుస్తోంది. పాద చారులు ఈ వంతెన మీదుగా వెళ్తుంటారు. నాపా వ్యాలీ వంతెన.. రైల్వే స్టేషన్, బోర్డింగ్ ప్లాట్ ఫారాన్ని కలుపుతుంది. ఈ వంతెన ప్రేమికులకు దర్శనీయ ప్రదేశంగా ఉంది. ఈ వంతెన మీద ప్రేమికులు తాళాలు వేస్తారు. అనంతరం గాఢంగా చుంబనాలు పెట్టుకుంటారు. ఇక్కడి నాపా రైల్ లో బిగ్ బ్యాంగ్ థియరీ ని ప్రదర్శించే అమీ, షెల్టన్ పెట్టుకున్న గాడచుంబనానికి ప్రతీకగా ఒక స్మారక తాళం ఉంది.
మౌంట్ హువాంగ్ షాన్, చైనా
మౌంట్ హువాంగ్ షాన్ అనేది చైనాలో ప్రసిద్ధమైన పర్వతం. చైనీస్ జానపద కథలలో ప్రేమికుడైన యూ_ లావో వృత్తాంతాన్ని వివరించే అనేక చిత్రాలు ఈ కొండపై ఉన్నాయి. ఈ పర్వతంపై ఏర్పాటు చేసిన పొడవాటి ఇనుప గొలుసు పై ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా తాళాలను వేస్తారు. కొందరు తాళం వేసిన తర్వాత అపరిమితమైన వేగంతో లోయలోకి విసిరేస్తారు. ఈ కొండ ప్రాంతంలో ఫైన్ చెట్లు విస్తారంగా ఉండటం వల్ల ప్రేమికులు ఆ చెట్ల నీడ కింద సేదతీరుతూ ఉంటారు. చైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దర్శనీయ ప్రదేశంగా మార్చడంతో ప్రేమికులు ఎక్కువగా వస్తూ ఉంటారు.
షెన్లీ పార్క్ వంతెన.. పీట్స్ బర్గ్
షెన్లీ పార్క్ వంతెన ఎప్పటి నుంచో ప్రాచుర్యం పొందినప్పటికీ
ఇది 2000 సంవత్సరంలో దీనికి రంగురంగుల ప్యాడ్ లాక్ లు అమర్చడంతో ఒక్కసారిగా ఆకర్షనీయ ప్రాంతంగా మారింది. పెన్సిల్వేనియాలోని దక్షిణ ఓక్ ల్యాండ్ పరిసరాల్లో షెన్లీ ప్లాజా, షెన్లీ పార్కులను కలుపుతూ ఈ వంతెన ఉంటుంది. ప్రేమికులు తమ ప్రేమకు చిహ్నంగా ఇక్కడ తాళాలు వేస్తూ ఉంటారు. అనంతరం ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి తాళం వేస్తే తమ బంధం ఎప్పటికీ బలంగా ఉంటుందని నమ్ముతుంటారు.
హోహెన్ జోలెర్న్ వంతెన, కొలో నెక్రిడిట్
హోహెన్ జోలెర్న్ వంతెన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులను ఆకర్షిస్తుంది. దీని కిందుగా రైన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో ఈ ప్రాంతం అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండటంతో ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక్కడికి వచ్చి ఆ వంతెనకు అటు ఇటుగా తాళాలు వేస్తూ ఉంటారు. ఆ తాళాలు తమ ప్రేమకు చిహ్నాలని భావిస్తూ ఉంటారు.