Homeఎంటర్టైన్మెంట్Gadar 2: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైన బ్లాక్ బస్టర్ మూవీ... ఎక్కడ? ఎప్పుడు...

Gadar 2: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైన బ్లాక్ బస్టర్ మూవీ… ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చు?

Gadar 2: గత ఏడాది బాలీవుడ్ కి బాగా కలిసొచ్చింది. షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ రూపంలో రెండు భారీ హిట్స్ ఇచ్చారు. ఇవి రెండు ఒక్కోటి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క హిట్ లేక ఏళ్లుగా అల్లాడుతున్న షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ అదిరింది. ఇక రన్బీర్ కపూర్ యానిమల్ మూవీతో చివర్లో వచ్చి మెరిపించాడు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే గదర్ 2 విజయం బాలీవుడ్ కి చాలా ప్రత్యేకం.

2001లో విడుదలైన గదర్ సంచలన విజయం అందుకుంది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. ఈ చిత్ర కంటెంట్, సాంగ్స్ జనాలను కట్టిపడేశాయి. దర్శకుడు అనిల్ శర్మ గదర్ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన గదర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించి అంతకు మించిన విజయం అందుకున్నారు. సన్నీ డియోల్-అమీషా పటేల్ మరోసారి జతకట్టారు.

2023 ఆగస్టు 11న గదర్ 2 విడుదలైంది. మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, సీరత్ కపూర్ కీలక రోల్స్ చేశారు. సన్నీ డియోల్ హీరోగా ఫార్మ్ కోల్పోయి చాలా కాలం అవుతుంది. ఆయనకు స్టార్డం లేదు. అమీషా పటేల్ పరిస్థితి కూడా సేమ్. అలాంటి నటులతో దర్శకుడు అనిల్ శర్మ మ్యాజిక్ చేశాడు. జనాలకు కంటెంట్ కనెక్ట్ కావడంతో అపూర్వ విజయం అందించారు.

గదర్ 2 చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. దీంతో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ వి కూడా ఆ సంస్థ వద్దే ఉన్నాయి. ఇక ఓటీటీలో సైతం మూవీ సత్తా చాటింది. వారాలు పాటు నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగింది. ఎట్టకేలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రంగం సిద్ధమైంది. గదర్ 2 చిత్రాన్ని జీ తెలుగులో ఫిబ్రవరి 18 ఆదివారం చూడొచ్చు. సాయంత్రం 5:30 నిమిషాలకు ప్రసారం కానుంది. దీంతో గదర్ సిరీస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గదర్ 2 విజయం నేపథ్యంలో సన్నీ డియోల్ వరుస చిత్రాలు చేస్తున్నారు.

Exit mobile version