Hacked Brazil Airport: సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాచారంలో కూడా విప్లవాలు వస్తున్నాయి. దీంతో మంచికి బదులు చెడు కూడా ఎక్కువగా ప్రచారం అవుతోంది. దీనికి చాలా మంది బాధితులు అవుతున్నారు. ప్రపంచంలో సమాచారం రంగంలో వస్తున్న నైపుణ్యాలను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను భయపెడుతున్నారు. పబ్లిక్ ప్లేసులను కూడా తమకు అనుకూలంగా మలుచుకుని చెడును ప్రసారం చేయాలని చూస్తున్నారు. ఫలితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ప్రపంచంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో మోసాలకు కొదవే లేకుండా పోతోంది. ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకుల్లో నగదు కొట్టేయడం, ఖాతాల నెంబర్లు హ్యాకింగ్ చేయడం, కంప్యూటర్లను కూడా హ్యాక్ చేయడం చేస్తున్నారు. దీంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మనం ఏదైనా మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోతాం. అంతే కాని అందులో ఉండే చెడును మాత్రం పట్టించుకోం. దీంతోనే మనకు నష్టాలు సంభవిస్తున్నాయి.
Also Read: Sr NTR Is A Food Lover: ఎన్టీఆర్ మంచి బోజన ప్రియుడు.. ఆయన ఎక్కువగా తాగేది ఏంటో తెలుసా?
బ్రెజిల్ లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని స్ర్కీన్లనే హ్యాకర్లు తమ గుప్పిట్లో పెట్టుకోవడం సంచలనం కలిగించింది. బ్రెజిల్ లోని రియోడిజెనీరియాలోని ఎయిర్ పోర్టులోని ఎలక్ర్టానిక్ డిస్ ప్లేలను తమ వశం చేసుకున్నారు. అంతే కాకుండా అందులో పోర్న్ వీడియోలు ప్రసారం చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు అందరు పరేషాన్ అయ్యారు. ఇదేమిటని బిక్క మొహం వేశారు. కానీ హ్యాకర్లు మాత్రం వాటని ఆపేయలేదు.

వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది డిస్ ప్లేలను ఆపేశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఇది ఎవరి పని అని ఆరా తీస్తున్నారు. పబ్లిక్ ప్రాంతంలో ఇలాంటి తెగింపుకు పాల్పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజల మధ్య ఇంతటి దుర్మార్గమైన చర్యలకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. వారు తమ చేతుల్లోకి తీసుకునే దాకా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పొరపాట్లే వారికి ప్లస్ గా మారినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read:Vangaveeti TDP: ఫోటో స్పెషల్ : టీడీపీ జెండాతో వంగవీటి అభిమాని