Sr NTR Is A Food Lover: చరిత్ర సృష్టించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. సీనియర్ ఎన్టీఆర్ గా ఆయనకు ఉన్న గుర్తింపు మామూలుది కాదు. ఎంతో వైవిధ్యమైన పాత్రలతో ఔరా అనిపించుకున్నారు. పౌరాణికమైనా సాంఘికమైనా ఆయన వేయని పాత్ర లేదు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, రావణుడైనా ఆయన వేస్తే అంతే సంగతి. ఆ పాత్రకే అందం రావడం సహజమే. ఎన్టీఆర్ సహజంగా మాంసాహారి. నాటుకోడి పులుసు అంటే మహా ఇష్టం. ఉదయం పూట ఆహారంలో ఇడ్లీ నాటుకోడి కూర ఉండాల్సిందే.
తన సినిమాలతో అందరిని మెప్పించిన ఎన్టీఆర్ భోజన ప్రియుడు. అందుకే ఆయన తన మెనూపై జాగ్రత్తగా ఉండేవారట. ఉదయం ఆరు గంటలకు షూటింగ్ అంటూ ఆయన మాత్రం 5.45కే అక్కడ ఉండేవారట. దీంతో ఆయనకు సమయం మీద కూడా చాలా గౌరవం ఉండేదట. ఇక ఉదయం అల్పాహారంలో ఇడ్లీలు, నాటుకోడి కూర ఉంటే ఇష్టంగా తినేవారట. అంతే కాదు ఎక్కడికైనా వెళ్లినా అక్కడ దొరికే వాటిని తీసుకునే వారట. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారట.
మధ్యాహ్నం భోజనంలో అన్నం, కోడికూర, పెరుగు, నెయ్యి ఉండేలా చూసుకునే వారట. భోజనం అనంతరం జ్యూస్ తాగేవారట. ఆపిల్ జ్యూస్ బాగా తాగేవారట. దీంతో ఆయన ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ చూపేవారు. అందుకే ఆయన ఎప్పుడు పుష్టిగా ఉండేవారు. ఉండేవారని తెలుస్తోంది. ఆయన ఆహారం విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడేవారు కాదట. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన మెనూలో తేడా ఉండకుండా చూసుకునేవారు.
Also Read: What A Sensation That KCR Says: కేసీఆర్ చెప్పే ఆ సంచలనం ఏమిటి?
సాయంత్రం మెనూలో డ్రై ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. దీంతో ఆయన ఎప్పుడు కూడా నీరస పడకుండా ఉండేవారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవితం ఓ తెరిచిన పుస్తకమే. ఆయన వాగ్దాటి, తీసుకునే ఆహారమే ఆయనలో మంచి నటుడిగా చేశాయని చెబుతుంటారు. ఇక వేసవిలో రెండు లీటర్ల బాదాం జ్యూస్ తాగేవారు. బాదాం జ్యూస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారట. జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకుని తాగుతుండేవారట. టీడీపీ స్థాపించిన తరువాత కూడా ఆయన రాష్ట్రాన్ని చుట్టుముట్టినా తన మెనూలో మాత్రం ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకునే వారు కాదు. అందుకే ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతుంటారు.
Also Read: Romance: రోమాన్స్ కు గ్యాప్ ఇస్తే ఎన్ని ప్రమాదాలో తెలుసా?